HomeTelanganaMaha Lakshmi Scheme Telangana: మహాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరు? కావాల్సిన ధృవపత్రాలివే..

Maha Lakshmi Scheme Telangana: మహాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరు? కావాల్సిన ధృవపత్రాలివే..

Maha Lakshmi Scheme Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టోల్లోని అంశాలను నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొదట ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా పేరు మార్చడంతోమొదలై.. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పల్లె వెలుగు, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. (Maha Lakshmi Scheme Telangana)

తాజాగా మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ, టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం హామీలు ఇచ్చింది కాంగ్రెస్.

మహాలక్ష్మి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు..
* మహిళ ఆధార్‌ కార్డు
* భర్త ఆధార్‌ కార్డు
* వయసు 18-55 సంవత్సరాలు
* తెల్ల రేషన్‌ కార్డు (ఆన్‌లైన్‌ జిరాక్స్)
* ఓటరు కార్డు (ఆప్షనల్‌)
* కరెంటు బిల్లు
* గ్యాస్‌ బిల్లు (ఆప్షనల్‌)
* బ్యాంకు పాస్‌ బుక్‌
* పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో
* ఆదాయ ధృవీకరణ పత్రం
* కుల ధృవీకరణ పత్రం
* సెల్‌ ఫోన్ నంబర్

రూ.2500 నగదు పొందడానికి అర్హతలు
* వివాహం అయి ఉండాలి.
* తెలంగాణ నివాసి అయి ఉండాలి.
* దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తుండాలి.
* వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి.
* కుటుంబంలో ఒక మహిళకే (యజమాని) సాయం అందిస్తారు.

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పొందడానికి అర్హతలు
* బీపీఎల్‌ కార్డు ఉండాలి.
* తెలంగాణ నివాసి అయి ఉండాలి.
* గ్యాస్‌ కనెక్షన్‌ రిసిప్ట్‌ కలిగి ఉండాలి.

* ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మాత్రం రాష్ట్రంలో మహిళలందరికీ ఆధార్‌ కార్డు ఉంటే చాలు. అది చూపించి, ఉచిత టికెట్‌ కండక్టర్‌ ద్వారా తీసుకొని పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లోఉచితంగా జర్నీ చేయొచ్చు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో మిగతా పథకాలు..

* రైతు భరోసా
ఈ పథకం కింద అన్నదాతలకు రూ.15000 పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇది కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. ఇక భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు రూ.12000 సాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అలాగే వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

* గృహజ్యోతి
ఈ పథకం కింద తెలంగాణలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చింది కాంగ్రెస్.

* ఇందిరమ్మ ఇండ్లు
ఈ పథకం కింద రాష్ట్రంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.

* యువ వికాసం
ఈ పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ అందుబాటులోకి తెస్తామని మేనిఫెస్టోలో వెల్లడించారు.

* చేయూత
ఈ పథకం కింద రూ.4000 నెలవారీ పింఛన్‌ అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. అలాగే రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా వర్తింపజేస్తామన్నారు.

ఇదీ చదవండి: Winter Health care: చలికాలంలో సన్‌షైన్ విటమిన్ ప్రాధాన్యం ఎనలేనిది.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు