Tabs to Students: దశాబ్ద కాలంలోనే ట్యాబుల పంపిణీ గొప్పమార్పు అని సీఎం జగన్ అన్నారు. దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యావిధానాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. స్థితిమంతుల పిల్లలకు ధీటుగా పేదింటి పిల్లకు డిజిటల్ విద్యావకాశాలు కల్పిస్తున్నామన్నారు. వారిని గ్లోబల్ సిటిజెన్లుగా తీర్చిదిద్దుతూ, జగన్ మామయ్య అందిస్తున్న కానుక ఇదని చెప్పారు. (Tabs to Students)
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వతరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్ధులకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో కూడిన ట్యాబులు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కామెంట్స్ ఇవీ.. (Tabs to Students)
* దేవుడుదయ మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి చేస్తున్నాం. నా గిరిపుత్రుల స్వచ్చమైన మనసులు మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాల ఇక్కడ నుంచి జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టిన రోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ… మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడి నాకిచ్చిన అదృష్టం.
* ఈ రోజు ఇక్కడ నా ఎదుట ఉన్న పిల్లలు, రాష్ట్రంలో ప్రతి ఇంట ఉన్న పిల్లలు.. వీరే మన భవిష్యత్. వీరంతా మన వెలుగులు. వీరంతా మన తర్వాత, మనం వెళ్లిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలిపే మన వారసులు. వీరి భవిష్యత్తు గురించి ఆలోచించి.. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రపంచంలో పోటీపడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని ఆశిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా పడింది. అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
* రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతిమండలాన్ని సందర్శిస్తూ…ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా 10 రోజులపాటు 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమం జరుగుతుంది.
* ఇవాళ మనం ఇచ్చేవి కేవలం ట్యాబులు మాత్రమే కాదు. ప్రతి చెల్లెమ్మకూ ఒక మంచి అన్నగా, ప్రతి పిల్లాడికి,పాపకు ఒక మంచి మేనమామగా మన పిల్లలు మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో, తరతరాల పేదరికం సంకెళ్లు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకొస్తున్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు పంపిణీ కూడా గొప్ప మార్పుగా రాబోయే దశాబ్దకాలంలో నిల్చిపోతుంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడులలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు 4,34,185 మందికి రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ మన పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతున్నాం.
* డిజిటల్‌విప్లవంలో భాగంగానే గతేడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18లక్షల ట్యాబులను పిల్లలకు, చదువులు చెబుతున్న టీచర్లకు పంపిణీ చేసాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్‌ను కూడా ప్రతి ట్యాబులోనూ ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేటట్టుగా అప్‌లోడ్ చేసి మరి ట్యాబులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి పిల్లాడికి పాఠాలన్నీ పూర్తిగా, సులభంగా అర్ధం అయ్యేటట్టుగా, కష్టాన్ని తగ్గించేటట్టుగా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి పిల్లలకు అండగా నిలబడుతున్నాం.
* ఈ ట్యాబుల విషయంలో నేను పిల్లలకు చెబుతున్నా.. ట్యాబులు రిపేరుకు వస్తే ఎవరూ కంగారుపడకండి. మీ హెడ్ మాష్టారు దగ్గరికి వెళ్లి చెడిపోయిందని రిపేరుకిచ్చినా, లేదా తల్లిదండ్రులతో పాటు గ్రామసచివాలయం దగ్గరకు వెళ్లి ఇచ్చినా రెండు చోట్ల రశీదు ఇస్తారు. వారం రోజుల్లోనే మీ ట్యాబ్ రిపేరు చేసి ఇస్తారు. ఒకవేళ రిపేరు చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతిలో పెడతారు. ఈ ట్యాబుల విషయానికొస్తే… ఇవి సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజిమెంట్ అనే సాప్ట్‌వేర్ పెట్టడం జరిగింది. దీనివల్ల పిల్లలు పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది టీచర్లకు, తల్లిదండ్రులకు ఈ సాప్ట్‌వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన, భయాలు అవసరం లేదు.
* ఒక్కో పిల్లాడు చేతిలో పెడుతున్న ఈ ట్యాబ్ మార్కెట్ విలువ రూ.17,500. దీనికి తోడూ బైజూస్ కంటెంట్‌ను ఇస్తున్నాం. ఎవరైనా శ్రీమంతులు పిల్లలు వెళ్లి బైజూస్ కంటెంట్‌ను కొనుగోలు చేసి, డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.15వేలు కడితే తప్ప డౌన్లోడ్ చేసుకోలేని పరిస్ధితి. అలాంటి ఈ కంటెంటెన్ ఉచితంగా డౌన్లోడ్ చేసి, ఈ ట్యాబులుతో సహా ఇస్తున్నాం. ఇవాళ 8వతరగతి విద్యార్ధి తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబ్, కంటెంట్ విలువతో కలుపుకుంటే రూ.33వేలు విలువ చేస్తుంది.
* ఈ పిల్లలందరినీ ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఎందుకు పెడుతున్నామంటే.. నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలవాలన్న తలంపుతో వాళ్ల మేనమామగా ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఒకవైపు ట్యాబుల పంపిణీ చేస్తూనే.. మరోవైపున ప్రతి స్కూళ్లో 6వతరగతి నుంచి పైబడిన ప్రతి తరగతి గదినీ డిజిటలైజ్ చేసే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వతరగతి నుంచి 12వతరగతి వరకు ఉన్న ప్రతి తరగది గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్(ఐఎఫ్‌పి)లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతిగదినీ డిజిటలైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది.
* నాడు నేడు మొదటిదశ పూర్తి చేసుకున్న స్కూళ్లలో 15,715 స్కూళ్లలో 6వతరగతి ఆపై ఉన్న 32,213 క్లాస్‌రూంలలో ఇప్పటికే ఐఎఫ్‌పిలు పెట్టి డిజిటలైజ్ చేశాం. 1 నుంచి 5వతరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్‌లు తీసుకువచ్చాం. వాటన్నింటిలోనూ స్మార్ట్ టీవీలు ఏర్పాటులో భాగంగా .. దాదాపు 10,038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ ఐఎఫ్‌పీలు, క్లాస్‌రూంల డిజిటౖలైజేషన్ కోసం మొదటిదఫాలో చేసిన ఖర్చు రూ.427 కోట్లు.
* నాడు–నేడు రెండో దఫా పనులు ఇవాళ వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడకి రాకముందు అధికారులను అడిగాను. రెండోదఫా నాడు–నేడు పనులు పూర్తి చేసి అక్కడ ఐఎఫ్‌పి ప్యానెల్స్ బిగించి 6వతరగతి నుంచి ఈ పైచిలుకు తరగతిగదులను డిజిటలైజ్ చేయడానికి ఎంత టైం పడుతుందని అడిగాను. దాదాపు మరో 31,884 తరగతి గదులు 6వతరగతి ఆ పై తరగతిగదులన్నీ డిజిటలైజ్ అయి, పూర్తిగా 62,097 తరగతిగదులన్నీ డిజిటలైజ్ అయ్యే కార్యక్రమం జనవరి 30 నాటికి పూర్తవుతుందని చెప్పారు.
* పిల్లలందరూ ఆంధ్రరాష్ట్రంలో బెస్ట్‌గా చూడాలని కాదు నేను పోటీపడుతున్నది.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నా పిల్లలు బెస్ట్‌గా ఉండాలని, చూస్తున్నాను. దానికోసం ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రాథమిక స్ధాయి.. అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చి టోఫెల్ పరీక్షకకు వాళ్లను సిద్ధం చేసేలా.. అమెరికాకు చెందిన టోఫెల్ నిర్వాహణా సంస్ధ ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం కూడా చేసుకున్నాం. ఈ రోజు టోఫెల్‌ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్ కేటాయిస్తూ 3వతరగతి నుంచి ప్రతి క్లాసులోనూ టీచ్ చేస్తూ…. కరిక్యులమ్‌లో తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది.
* విద్యారంగంలో భవిష్యత్తు ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా ఉంచేందుకు ఐబీ సిలబస్‌ను రాబోయే రోజుల్లో తీసుకువస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఈ సిలబస్‌ను తీసుకువస్తున్నాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సులభంగా ఉద్యోగావకాశాలు పొందుతారు. దీనికోసం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువస్తూ ఐబీ సర్టిఫికేట్ తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వస్తూ సంయుక్త సర్టిఫికెషన్ తీసుకువచ్చేలా మార్పులు.
* ప్రయివేటుబడులలో పెద్దవాల్లు, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా రూ.15వేలు ఏడాదికి ఖర్చుచేస్తే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్‌ను ఇవాళ మన పిల్లలకు ఇవ్వడం కానీ.. 6వతరగతి ఆపై తరగతులకు సంబంధించి ప్రభుత్వ బడులలో ప్రతి తరగతిగదిని డిజిటలైజ్ చేస్తూ.. పిల్లలకు సులభంగా పాఠాలు అర్ధమయ్యేలా చేస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంకు మారడంతో పాటు అదొక్కటే సరిపోదని సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతున్న ప్రయాణం వరకు.. మంచి ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో ప్రతి స్కూల్‌లోనూ కనిపిస్తున్నాయి.
* మన మీద దుర్బిద్ధితో బురద జల్లుతున్నారు…
పేదల పిల్లల చదువులు మీద దేశచరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం పెట్టనంత దృష్టి పెట్టి.. పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల కోసం మార్పులు తీసుకువస్తున్న మన ప్రభుత్వంమీద దుర్భిద్ధితో, దురుద్దేశంతో బురదజల్లుతున్నారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని మీ జగన్ ఆరాటపడుతుంటే… మంచేస్తున్న ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు.
* ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు వీరు ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు. పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా చెప్తున్నారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు. మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ పేద వర్గాలకు చెందిన పిల్లలుమీద తప్పుడు రాతలు రాస్తున్నారు. ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబులు ఇవ్వొద్దని ప్రతిరోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు.
* అది పేపరా.. పేపరుకు పట్టిన పీడా…
జగన్ బర్త్‌డే బహుమతి.. చెడగొడుతోంది మతి, గాడితప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఈనాడులో రాశారు. ఇది పేపరా.. పేపరుకు పట్టిన పీడా. దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్‌ను చదవొచ్చా. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్లకు చెప్తున్నాను. ఇంతగా దిగజారి మాటలు మాట్లాడకండి అని చెప్తున్నాను. పేదవర్గాల పిల్లలమీద ఇంతగా విషం కక్కకండి అని చెప్తున్నాను. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపుమంట వద్దండీ అని చెప్తున్నాను.
* మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, ల్యాప్‌ట్యాపులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు. కానీ పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాప్‌ట్యాపులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని ప్రశ్నిస్తున్నాను.
మీ పిల్లల చేతులలో ఇవన్నీ ఉంటే చెడిపోరు, కాని పేదల పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు, ల్యాప్‌టాపులు, స్మార్ట్ ఫోన్లు ఉంటే మాత్రం ఉంటే చెడిపోతారు.
* మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి, కాని పేద పిల్లలు ఇంగ్లిషు మీడియం బడులకు వెళ్లకూడదు, ఇంగ్లిషు చదవకూడదు. పేదపిల్లలు ఇంగ్లిష్ మీడియం మాత్రం చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగుభాష అంతరించిపోతుంది అంట?.
కాని వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలి. ఇది ధర్మమేనా? ఆలోచన చేయండి. ఇలాంటి ఆలోచనలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధంచేస్తున్నాడు.
* ఈ రోజు మీరంతా ఇవన్నీ చూస్తున్నారు. ఒకవైపు జగన్ ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పులు పాలై పోయిందని రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పులు పాలయిపోతుందంటారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి.. ఆరు గ్యారంటీలు అని చెపుతాడు. వాటిని వీళ్లు పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా రాస్తారు. వాళ్లు ఇస్తానన్నవి, ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ అన్నీ కలిపితే.. జగన్ ఇచ్చేవాటికన్నా, వాళ్లు చెప్తున్నవి మూడింతలు ఎక్కువ. ఎంత మోసానికైనా వాళ్లు వెనకడుగు వేయరు. గతంలో 2014–19 వరకూ వాళ్లే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇదే దత్తపుత్రుడు ఉన్నారు. ఆ రోజుల్లో రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నారు, వాళ్లనూ మోసంచేశారు.
* పొదుపు సంఘాల రుణాలు మాఫీచేస్తానన్నారు, వాళ్లనీ మోసం చేశారు. ఇంటింటికీ జాబు ఇస్తాను. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, జాబు ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగభృతి, అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ రూ.1లక్ష. ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 వరకు ఎవ్వరినీ వదలకుండా మోసం చేశారు. అవ్వాతాలనూ, రైతులను, పిల్లలను, అక్క చెల్లెమ్మలను మోసంచేశారు. చివరకు వారి మేనిఫెస్టోను ఎవ్వరికీ కనిపించకుండా.. ఇంటర్ నెట్‌లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమోనని దాన్ని నెట్లో నుంచి కూడా తీసేశారు.
* ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగానూ, ఖురాన్‌గానూ, బైబిల్‌గానూ భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99.5శాతం వాగ్దానాలను అమలు చేశాం. ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈ రోజు మీ బిడ్డ 55 నెలల పాలనలో మీ బిడ్డ బటన్ నొక్కాతున్నాడు. రూ.2.40లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయండి. మీ బిడ్డ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు. గతంలో పరిపాలన చేసిన వాళఅలు ఎందుక్లు మీ బిడ్డలా ఎందుకు చేయలేకపోయారు.
* ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో 31లక్షల ఇళ్లపట్టాలు అందులో 22 ఇళ్ల లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో ఎందుకు జరిగించగలుగుతున్నాడు, చంద్రబాబు హయాంలో జరగలేదో ఆలోచన చేయండి. మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతుంది, గ్రామాలన్నీ మారి ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో వాలంటీర్ వ్యవస్ధ ప్రతి ఇంటికి వచ్చి ఒకటో తేదీన సెలవైనా.. ఉదయాన్నే వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ అవ్వా,తాతల చేతుల్లో పెన్షన్ ఎలా పెట్టగలుగుతున్నారో ఆలోచన చేయండి.
* రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు. ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. ఇంకా ఎక్కువ అబద్దాలు చెబుతారు. గుర్తుపెట్టుకొండి. ఎవరైతే మీకు మంచిచేశారో.. వారిని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ల ముందు నిలబడి మీ కళ్లలోకి చూసి చెప్పగలుగుతున్నాను.. మీకు మంచి జరిగితే మాత్రం.. మీ బిడ్డకు మీరు తోడుగా నిలబడాలని కోరుతున్నాను.
ఇదీ చదవండి: Anganwadi: అంగన్‌వాడీలకు శుభవార్త.. డిమాండ్ల పరిష్కారం కోసం జగన్ సర్కార్ సానుకూలం
