HomeAndhra PradeshDGP Disk Awards: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఏపీ డీజీపీ డిస్క్‌ అవార్డులు

DGP Disk Awards: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఏపీ డీజీపీ డిస్క్‌ అవార్డులు

DGP Disk Awards: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల విభాగంలో 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ స్థాయి అధికారుల వరకు డీజీపీ డిస్క్ అవార్డులు ప్రదానం చేశారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ అవార్డులను సిబ్బందికి అందజేశారు. నిన్న మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. (DGP Disk Awards)

రాష్ట్రవ్యాప్తంగా 2022లో క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా ఎస్పీలు, డీ‌ఐ‌జీలు, ఐ‌జీలు, అడిషనల్ డిజీలను గుర్తించి వారు అందించిన సేవల అర్హత అదరంగా 65 మందికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిస్క్ (Gold, Silver, Bronze) మెడల్స్ ను అదించారు. 15 మంది ఎస్పీలు గోల్డ్ మెడల్, 56 మంది కానిస్టేబుల్ నుంచి ఐ‌పీ‌ఎస్ లు సిల్వర్ మేడల్స్, 05 మంది డీఎస్పీలు, ఏ‌ఎస్‌ఐలు బ్రోంజ్ మేడల్స్ ను డీజీపీ చేతుల మీదుగా అందుకున్నారు.

సత్ఫలితాలు ఇస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్

కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని గత సంవత్సరం(2022) జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సి‌పి/ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు/ఆరు కేసులు తమ పర్యవేక్షణలో ప్రతిరోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ఈ సంవత్సరం తీవ్రమైన నేరాల నమోదు శాతంలో గణనీయంగా అదుపు చేసినట్లు తెలిపారు. కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానాన్ని గత సంవత్సరం(2022) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా నేరాల తీవ్రత ఆధారంగా గత సంవత్సరంలో గుర్తించిన 165 కేసుల్లో న్యాయస్థానాలలో విచారణ ప్రక్రియ పూర్తి చేసుకొని నూటికి 100% శాతం నిందితులకు కోర్టులు శిక్షలు విధించాయన్నారు.

పోలీస్ శాఖలోని వివిధ విభాగాలైన అవినీతి నిరోధక శాఖ, సీఐడీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంటెలిజెన్స్, ఏపీఎస్పీ బెటాలియన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్‌ఈ‌బీ) విభాగాలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది వివరాలను సేకరిస్తామన్నారు. త్వరలోనే వారికి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ డిస్క్ అవార్డులను అందిస్తామన్నారు.

క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉండేందుకే ఈ అవార్డులను అందిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. వారు చేస్తున్న సేవలను గుర్తించి ఈ మెడల్స్ అందించడం ద్వారా మరింత ఉత్సాహంతో వారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎంతగానో దోహద పడుతుందని వివరించారు.

ఇదీ చదవండి: Kommineni: విద్యయే ఎనలేని సంపద.. గొప్ప ఆశయంతో సీఎం జగన్‌ సంస్కరణలు: కొమ్మినేని

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు