YS Jagan in Uddanam: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని సీఎం జగన్ అన్నారు. వైయస్సార్ సుజలధార ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం కాశీబుగ్గ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తి సారాంశం ఇదీ.. (YS Jagan in Uddanam)
* దేవుడి దయతో ఈరోజు రెండు మంచి గొప్ప కార్యక్రమాలు జరిగాయి.
* మరో రెండు కార్యక్రమాలకు కూడా ఒక దానికి బాయ్స్ హాస్టల్ ఒకదానికి ఇనాగురేషన్, రెండోది ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది.
* ఈ రెండు మంచి కార్యక్రమాలయితే, వీటికన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో రెండు కూడా ఈరోజు ఇనాగురేట్ చేయడం జరిగింది.
* ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది.
* మామూలుగా ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటాం. ఉద్దానం అంటే దాని అర్థం ఉద్యాన వనం అని.
* ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి కాటు వేసినట్టుగా ఇక్కడి ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దాని వల్ల అనేక కుటుంబాలు, వాళ్ల జీవితాలు అల్లకల్లోలం ఇవన్నీ మన కళ్ల ఎదుట కనిపిస్తున్న దృశ్యాలు.
* ఈ పరిస్థితిని నా పాదయాత్రలో కళ్లారా చూశాను. (YS Jagan in Uddanam)
* నన్ను ఇక్కడి ప్రజలు కలిసినప్పుడు, వాళ్ల గోడు చెప్పినప్పుడు, వాళ్లందరికీ నేను చెప్పినమాట నాకు ఇవాళ్టికి కూడా గుర్తుంది.
* ఆరోజు నేను అన్నాను. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పాను.
* 2018, డిసెంబర్ 30న ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇచ్చాను.
* దేవుడి దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పాం.
* కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని చెప్పడం జరిగింది.
* దేవుడి దయతో ఈ రెండు పనులు మీ బిడ్డ పూర్తి చేశాడని చెప్పడానికి గర్వపడుతున్నా.
* అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా ఆలస్యం జరగకుండా రూ.85 కోట్లతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించి 2019 సెప్టెంబర్ లో వెంటనే కార్యాచరణ రూపొందించి మంజూరు చేశాం.
* గతంలో మనందరికీ ఈ సమస్యలున్నాయని తెలిసినా, గతంలో ఏ పాలకుడూ కనీసం ఊహల్లో కూడా సాహసించలేదు.
* గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధి చూపించాడు.
* ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచినీటి వసతి తీసుకొచ్చేందుకు ఏకంగా రూ.700 కోట్లతో హిర మండలం రిజర్వాయర్ నుంచి పైపులైన్లు వేసి వైయస్సార్ సుజల ధార పథకాన్ని తీసుకొచ్చాం.
* ఆరోజు ఏప్రిల్ 2020లో మంజూరు చేశాం.
* ఈ రెండు పథకాలు ఈరోజు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తూమీ బిడ్డ మీ కళ్ల ఎదుట నిలబడ్డాడు.
* కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పని చేయబోతోంది.
* డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
* ఇక్కడికి రాకముందు హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు అన్నతో మాట్లాడాను. ఈ ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు, దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పని చేస్తోందో చూపించాలని మాట్లాడ్డం జరిగింది.
* ఈ ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు చేసే కార్యక్రమం జరగబోతుంది.
* ఈ ఆస్పత్రిలో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది. సెంట్రల్ ల్యాబ్ ఉంది, రేవ్యో డయోగ్నస్టిక్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ డయాలసిస్, యూరాలజీ ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబులు కూడా అందుబాటులో ఉన్నాయి.
* అత్యాధునిక సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్ రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం రేజర్, యూరో డైనమిక్ మిషన్ లాంటి ఆధునిక సదుపాయాలు అన్నీ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి.
* నిజంగా ఏదైనా సీరియస్ గా అనిపించినప్పుడు ఎక్కడికో పరుగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు పలాసలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
* ఈరోజు ఇదే కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 42 మంది వైద్యులు, 154 మంది పారా మెడికల్ సిబ్బందితోపాటు సెక్యూరిటీ, శానిటేషన్ పెస్ట్ కంట్రోల్ పోస్టుల్లో మరో 220 మంది పని చేస్తున్నారు.
* మొత్తంగా ఈ ఆస్పత్రిలో 375 మంది ఈరోజు సేవలు అందిచేందుకు మీ అందరికీ అందుబాటులో ఉన్నారు.
* ఇదే ఉద్దానం ప్రాంతంలో 7 మండలాలు ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరులో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తున్నాం.
* 25 సంవత్సరాలు పైబడిన వారిలో 232898 మందిని స్క్రీనింగ్ చేశాం. వారిలో 19532 మందిని సాధారణం కంటే సీరం క్రియేటన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
* వీరిని ఐడెంటిఫై చేసి వైద్యం మొదలు పెట్టామని చెప్పడానికి గర్వపడుతున్నా.
* ఉద్దానంలో 18 పీహెచ్‌సీలలో, 5 అర్బన్ పీహెచ్‌సీలలో, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సెమీ ఆటో ఎనలైజర్లు ఈరోజు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది.
* కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను అన్ని పీహెచ్ సీలలో అందుబాటులోకి తెచ్చాం.
* వీటిని విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తున్నాం. ఈ మందులన్నీ కూడా ఉచితంగా ప్రతి పేద వాడికీ గడప ముంగిటకే ఇచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం.
* విలేజ్ క్లినిక్ లు, ఆరోగ్యసురక్ష కార్యక్రమంతో చేయి పట్టుకొని ప్రతి పేద వాడికీ అండగా ఉంటున్నాం.
* ఇప్పటికే 5 చోట్ల కవిటి, సోంపేట, పలాస, హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే 69 డయాలసిస్ యంత్రాలను విస్తరించాం.
* మరో బారువ, ఇచ్చాపురం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కంచిలి పీహెచ్ సీలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం.
* కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకొనేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగూ మానవతా దృక్పథంతో అడుగులు వేశాడు.
* మీ బిడ్డగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను 2019 మే 30న రూ.2500 ఇస్తున్న పింఛను ఏకంగా రూ.10 వేలకు పెంచాం.
* ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంత మందికే ఇస్తున్న పరిస్థితి మారుస్తూ, ప్రతి ఒక్కరినీ కవర్ చేసేలా అందుబాటులోకి తీసుకొచ్చాం.
* తీవ్ర కిడ్నీ వ్యాధులతో సీకేడీ డిసీస్ తో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి వాళ్లకు కూడా రూ.5 వేలు పింఛన్ ఇచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే.
* ఎన్నిలకు కేవలం 6 నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటున్న వారు, పింఛన్లు పొందుతున్న వారు కేవలం 3076 మంది. వారి మీద ఖర్చు చేస్తున్నది అప్పట్లో కేవలం నెలకు రూ.76 లక్షలు
* మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ పెన్షన్ల జాబితాలో చేర్చాం. 13140 పింఛన్లు పెంచడం జరిగింది.
* పించన్ పొమ్ము కూడా పెంచి నెలా నెలా ఈరోజు మనకు ఖర్చవుతున్న సొమ్ము.. రూ.12.54 కోట్లు.
* ఉద్దానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకొస్తున్నాయి? మూల కారణం తెలుసుకొనేందుకు మీ బిడ్డ ఆరాట పడ్డాడు.
* కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ తో పాటు జార్జ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం మొదలు పెట్టింది.
* నాలుగు దశల్లో సాగే ఈ అధ్యయనం ఇప్పటికే మూడు దశలు పూర్తి చేశాం.
* కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఉన్న వారిని గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయడం, వ్యాధి తీవ్రతను తగ్గించడం వంటి వాటితో వైద్యాధికారులందరికీ కూడా వేగంగా శిక్షణ ఇప్పటికే అమల్లో ఉంది.
* ప్రపంచంలోనే అత్యుత్తమ పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ తో పాటు నార్త్ కరొలినా యూనివర్సిటీని కూడా మనందరి ప్రభుత్వం మనతోపాటు కలిసి పని చేసేట్టుగా ఎంవోయూ చేసుకుంటోంది.
* కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడుకొనేట్టుగా చేస్తాడు మీ బిడ్డ.
* ఈ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక నోడల్ సెంటర్ గా వ్యవహరించబోతోంది.
* రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఎక్కడున్నా కూడా ఆదుకొనే విషయంలో పర్మినెంట్ సొల్యూషన్ ఇచ్చే విషయంలో అడుగులు వేగంగా అడుగులు వేశాం.
* ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇటువంటి సమస్య ఉందని అక్కడ కూడా సర్ఫేజ్ వాటర్ తీసుకురావాలని తపన పడుతూ వెలుగొండ టన్నెళ్ళను పరుగెత్తించాం.
* రేపు నెలలో జాతికి అంకితం చేసే పరిస్థితి తీసుకొచ్చాం.
* మార్కాపురంలో మెడికల్ కాలేజీ స్థాపించడం, కిడ్నీ సేవల కోసం నెఫ్రాలజీ, యూరాలజీ డివిజన్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది.
* ప్రతి అడుగులోనూమనసు నిండా ప్రేమతో, అభిమానంతో మీ బిడ్డ మీ కోసమే పని చేస్తున్నాడని చెప్పడానికి గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా,
* ఇదే ఉద్దానం ఉత్త కిడ్నీ ఆస్పత్రితో సరిపెట్టలేదు. దీనికి పర్మినెంట్ గా పరిష్కారం చూపాలని అడుగులు వేగంగా ముందుకు వేశాం.
* ఎవరూ కూడా ఊహకు కూడా ఊహించని విధంగా 700 కోట్లు ఖర్చు చేసి మరీ హిర మండలం నుంచి పైపులు తీసుకొచ్చి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసేలా అడుగులు వేశాం.
* ఇదీ మీ జగన్ కు మీ పట్ల ఉన్న కమిట్ మెంట్.
* ఈ కమిట్ మెంటే తేడా చూపిస్తుంది గత పాలకులకు, మనకు.
* 807 గ్రామాలు ఈ నెలాఖరుకల్లా ప్రతి గ్రామం పూర్తిగా కనెక్ట్ అవుతుంది.
* 1.98 లక్షల కుటుంబాలు, 6.70 లక్షల జనాభాకు సురక్షిత తాగునీటిని అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైంది.
* ఈ పథకాన్ని ఫేజ్ 2 కింద ఇంకా విస్తరించబోతున్నాం.
* 265 కోట్లతో పాతపట్నం నియోజకవర్గంలో 448 గ్రామాలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయించబోతున్నాం.
* దానికి టెండర్లు, అగ్రిమెంట్లు, సర్వే పూర్తి అయిపోయింది. సంక్రాంతి తర్వాత ఆ పనులు మొదలు పెడతారు.
* ఇక్కడే మరికొన్ని విషయాలు మీ అందరూ ఆలోచించాలని విన్నవిస్తున్నా.
* ఈ ఉద్దానంలో ఈ సమస్య, కిడ్నీ బాధితుల సమస్య ఒక రోజులో వచ్చింది కాదు.
* ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేది.
* కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు, ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగిందని ఈ సందర్భంగా మీ అందరూ ఆలోచన చేయాలని విన్నవిస్తున్నా.
* మరి గతంలో చంద్రబాబు హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు, చెయ్యలేదు. ఎందుకు పట్టించుకోలేదు?
* మరి మీ బిడ్డ ఇంతగా ఎందుకు పట్టించుకొని తపించి, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు.
* కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే. మీ బిడ్డకు మీ పట్ల మనసు ఉంది. పేద వాడు ఎలా బతుకుతున్నాడు?
* పేదవాడిని ఎలా ఆదుకోవాలి, పేదవాడికి ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి ఎలా లాగాలి, ఎలా బతుకులు మార్చాలని అనే తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది. తేడా ఇదీ అని గమనించాలి.
* ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్దమనిషికి లెక్కే లేదు.
* తన సొంత నియోజకవర్గం కుప్పానికి గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే లేదు.
* కుప్పానికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్లీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే.
* మరి సొంత నియోజకవర్గం, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్రపై ఏం ప్రేమ ఉంటుంది?
* ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది ఆలోచన చేయాలి.
* ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం గానీ, మమకారం గానీ చూపించని ఈ చంద్రబాబు.
* 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకొనే దానికి ఒక్క మంచిపనీ లేదు.
* తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకొనే దానికి ఒక్క స్కీమ్ కూడా లేని పరిస్థితి.
* తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడని, మాట కోసం ఎందాకైనా పోయాడని, నిలబెట్టుకున్నాడని కనీసం చెప్పుకొనేందుకు ఒక్క విషయం అయినా లేదు.
* ఇలాంటాయన ఎన్నికలు వచ్చే సరికే పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు.
* ఈ పెద్దమనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిగా యాక్టర్ ను పెట్టుకొని డ్రామాలు ఆడతాడు.
* ఈ దత్తపుత్రుడు ఎవరంటే, ఎలాంటి వాడు అంటే.. మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు.
* అభ్యర్థులను నిలబెడుతూ, తెలంగాణలో అన్నమాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది.
* తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటాడు. తన దురదృష్టం అంటాడు.
* ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇంకొక పార్టనర్.
* ఈ పెద్ద మనిషి ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెంలగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్, ఈ మ్యారేజీ స్టార్.
* ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయన పడిన ఓట్లు ఎన్నో తెలుసా?
* చివరికి ఇండిపెండెంట్గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలేదు.
* ఈ పెద్దమనిషికి చంద్రబాబు ప్రయోజనవర్గం ఉంది తప్ప, ఆంధ్ర రాష్ట్రంపై ప్రేమే లేదు.
* సొంత నియోజకవర్గం లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య ఎన్నికల్లో కలిసి వచ్చారు.
* 2014-2019 మధ్య ఈ ఉద్దానం ప్రాంతానికి మంచి నీరు ఇవ్వడం ఎలా అని కనీసం ఆలోచన అయినా చేశారా అంటే అదీ లేదు.
* కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్, ఆస్పత్రి నిర్మించారా అంటే అది కూడా లేదు.
* వీళ్ల బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచీ లేదు.
* ప్రతి పక్షంలో ఉండి కూడా వాళ్లు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు.
* రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాం అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి అడ్డుకుంటున్న దుర్మార్గం వీరిది.
* ఉత్తరాంధ్రలో ఒక బిల్డింగ్ కట్టినా వీళ్లు ఏడుస్తాడు. మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానన్నా ఏడుస్తారు.
* ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పోర్టు వస్తుందన్నా ఏడుస్తారు.
* ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామంటే ఏడుస్తారు.
* ఈ ఏడుపంతా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా తయారయ్యారు.
* ఓ చంద్రబాబు ఓ రామోజీరావు, దత్తపుత్రుడు, రాధాకృష్ణ, టీవీ5 వీళ్లంతా ఒక దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తుంటారు.
* వీళ్లలో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్లంతా ఉండేది హైదరాబాద్ లో.
* ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్లు నిర్ణయిస్తామని మనకు చెబుతారు.
* దానికి తగ్గట్టుగా ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్, చంద్రబాబు, దత్తపుత్రుడు.. ఇవే కథలు.. రోజూ ఈ డ్రామాలు.
* వీళ్లలో ఏ ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలట.
* నేనుచెప్పిన విషయాలు ఆలోచన చేయాలి.
* అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు, వారు ఏనాడూ ఇవ్వని విధంగా ఇంటింటికీ పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుపు.
* వారి హయాంలో ఇచ్చిన వెయ్యి పించన్ మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3 వేలు చేస్తుంటే ఏడుపు.
* వారి హయాంలో విచ్చలవిడి దోపిడీని అరికట్టి, జన్మభూమి కమిటీలు రద్దు చేసి ప్రతి గ్రామంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేద వాడికీ తోడుగా ఉండి నడిపిస్తుంటే ఏడుపు.
* వారు ఇవ్వని విధంగా, ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2.10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు.
* వారి ఐదేళ్ల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో వైయస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఆర్బీకే వ్యవస్థ, పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ.. ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ అందిస్తున్నందుకు వీరంతా ఏడుపు.
* అక్కచెల్లెమ్మల్ని, పొదుపు సంఘాల్ని నిలువునా ముంచేసిన ఈ బాబుకు,
* వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైయస్సార్ చేయూత, జగనన్న అమ్మ ఒడి.. ఇవన్నీ కూడా పార్టీలు కూడా చూడకుండా మీ బిడ్డకు గతంలో ఓటు వేశారా లేదా అన్నది చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేయాలని అడుగులు వేస్తుంటే ఏడుపు.
* ఐదేళ్లు వాళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం పేద వాడికి ఒక సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు
* నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఉండాలి, లక్షాధికారులు కావాలని తపన పడుతూ 31 లక్షల ఇంటి పట్టాలు వారి చేతిలో పెడితే ఏడుపు.
* ఏకంగా 22 లక్షల ఇళ్లు మీ బిడ్డ కట్టిస్తుంటే ఏడుపు.
* పేద పిల్లల బతుకులు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి, పేద పిల్లలు వెళ్తున్న గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకొస్తే ఏడుపు.
* గోరుముద్ద, నాడు-నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడుల్లో పెడితే ఏడుపు.
* 6వ తరగతి, ఆ పై తరగతుల పిల్లలకు, ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్ పీ ప్యానల్స్ తెస్తే ఏడుపు.
* 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు.
* ఏకంగా 35 లక్షల ఎకరాలు హక్కులేని భూములకు, అసైన్డ్ భూముల మీద పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు.
* 2014-19 మధ్య వాళ్లు అధికారంలో ఉన్నారు. మేనిఫెస్టోలో 10 శాతం వాగ్గానాలు కూడా అమలు చేయని వీరు..
* మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టోను తెచ్చి ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేస్తే ఏడుపు.
* దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబు. బటన్ ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబు.
* మీ బిడ్డ హయాంలో ఏకంగా 2.40 లక్షల కోట్లు మీ బిడ్డ హయాంలో నేరుగా బటన్ నొక్కుతున్నాడు.
* ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నా ఏడుపే ఏడుపు.
* మరో 1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీగా పేద వారి కోసం ఇస్తున్నా కూడా ఏడుపే ఏడుపు.
* ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో మూడు నెలలు భరించండి.
* ఈ క్యాన్సర్ గడ్డల్ని, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని తెలియజేస్తున్నా.
* ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, పేదల వ్యతిరేకులంతా, పెత్తందార్లంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా తీర్పు ఇవ్వాలని మిమ్మల్నందరినీ సవినయంగా కోరుతున్నా.
* రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి, మోసాలు ఎక్కువ అవుతాయి.
* ఎవరు మాట ఇచ్చారు. మాట మీద నిలబడింది ఎవరు అనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి
* మీ బిడ్డ ధైర్యంగా మీ ముందుకు వచ్చి చెప్ప గలుగుతున్నాడు.
* మీ ఇంటికి, మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీరే సైనికులుగా మీ బిడ్డకు నిలబడండి అని అడుగుతున్నాడు.
* ఇలా అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా?
* రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు, ఇంతకన్నా నాలుగింతలు ఎక్కువ చెబితే గానీ నమ్మరు అని చెప్పి.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని చెబుతారు.
* మాటలు చెప్పడం చాలా సులభం, మాటలు చెప్పి మోసం చేసేవాళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండని కోరుతున్నా.
* మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకు ఉంది. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆశీర్వదించండి.
* దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
ఇదీ చదవండి: Uddanam: నాడు నేను ఉన్నాను అన్నాడు.. నేడు చేసి చూపించాడు.. కిడ్నీ సమస్యపై యుద్ధంలో గెలిచిన జగన్..!
