YSRCP Youth President: వైయస్సార్‌సీపీలో వరుస మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే పలువురిని మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలిగి రాజీనామా చేయడంతో మొదలైన ఈ పర్వం.. ఆ వెంటనే 11 మంది ఇన్‌చార్జ్‌లను మారుస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరిలో మంత్రులు కూడా ఉండటం విశేషం. అదే ఊపులో రెండో రోజు కూడా పలు నియామకాలు జరిగాయి. (YSRCP Youth President)
వైయస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీ నియామకం
అధికార పార్టీ రాష్ట్ర యువజన విభాగాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రక్షాళన చేశారు. నూతన కమిటీని నియమిస్తూ నిన్న పార్టీ కార్యాలయం వెల్లడించింది. కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని నియమించారు. ఉపాధ్యక్షుడిగా కొండా రాజీవ్ గాంధీ, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నియామకం అయ్యారు. 64 మందితో నూతన కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది.
మొదటి నుంచి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీలో యాక్టివ్‌గా ఉండటం, రాయలసీమ యాసలో తనదైన శైలిలో డైలాగులు, ఆకట్టుకొనే మాటలతో దూసుకెళ్తున్నారు. పలు నియోజకవర్గాల్లో తిరుగుతూ కేడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు. ఇటీవల శాప్ చైర్మన్‌గానూ అధిష్టానం గుర్తించి పదవి కట్టబెట్టింది. ఇప్పుడు యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడం మరింత జోష్ ఇచ్చినట్లయింది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం నూతన కమిటీ నియామకం
అధికార పార్టీ మహిళా విభాగం నూతన కమిటీని నియమిస్తూ పార్టీ కార్యాలయం నిర్ణయం వెలువరించింది. అధ్యక్షులుగా ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణి ఇద్దరినీ నియమించారు. ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీ శర్మ, బండి పుణ్యశీల, డా. శశికళ నియామకం అయ్యారు. మొత్తంగా 64 మందితో నూతన కమిటీని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన వెలువరించింది.
