HomeTelanganaBhatti Vikramarka: ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దీవించారు : భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దీవించారు : భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: తెలంగాణలో అధికారం తమదేనని కాంగ్రెస్‌ దీమా వ్యక్తం చేసింది. ప్రజలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీని దీవించారని భట్టి విక్రమార్క తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని తేలిందన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. అధికారం దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. (Bhatti Vikramarka)

ధరణిని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ పరిధిలో వేలాది ఎకరాలు దోచుకున్నారన్నారు. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు, ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే అడ్డగోలు పనులు చేయవద్దని రెవెన్యూ అధికారులకు సూచిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు ఈ రెండు, మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలు పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని భట్టి తెలిపారు.

కౌంటింగ్ ఏర్పాట్లు

* ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
* నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రత
* స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు
* కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు
* కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు
* 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు
* ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
* ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ
* ప్రతి టేబుల్ పై మైక్రో అబ్జర్వర్….కౌంటింగ్ సూపర్ వైజర్….ఇద్దరు అసిస్టెంట్లు
* ఎన్నికల నిబంధనల పై 2023లో 13 వేల కేసులు
* 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనల పై 2,400 కేసులు

తెలంగాణ పోలింగ్ శాతం 70.74 నమోదు: సీఈవో వికాస్ రాజ్
* రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ
* 2018తో పోల్చితే 3 శాతం తగ్గిన పోలింగ్ శాతం
* 18 ఏళ్ల వారు 3.06 శాతం ఉన్నారు
* రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ కు అవకాశం లేదు
* హైదరాబాద్ లో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్
* భువనగిరిలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్
* 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
* గతం కంటే 3 శాతం తగ్గిన పోలింగ్
* 2018లో నమోదైన పోలింగ్ శాతం 73.37
* 2018 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన పోలింగ్ శాతం

Read Also : Exit Polls: ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌.. కాంగ్రెస్‌ హవా కొనసాగుతుందా? తెలంగాణలో పల్స్‌ ఎలా ఉందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు