YSR Kalyanamasthu shadi thofa Funds: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకం కింద నిధులను నేడు సీఎం జగన్ విడుదల చేస్తున్నారు. జూలై- అక్టోబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. (YSR Kalyanamasthu shadi thofa Funds)
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తోంది ఏపీ సర్కార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు” ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది.
ఈ పథకానికి అర్హత సాధించాలంటే వధూవరులిద్దరికీ పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. బాల్య వివాహాల నివారణ కోసం ఈ నిబంధన పెట్టింది జగన్ ప్రభుత్వం. పిల్లలు ఇంటర్ వరకు చదివేందుకు జగనన్న అమ్మ ఒడి సాయం అందిస్తోంది. పై చదువులకు విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, భోజన, వసతి ఖర్చులకు వసతి దీవెన ద్వారా లబ్ధి చేకూరుస్తోంది.
ప్రస్తుతం అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్సార్ కళ్యాణమస్తు/ వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 348.84 కోట్లు జమ చేసినట్లవుతోంది. గత ప్రభుత్వం 17,709 మంది లబ్దిదారులకు ఇస్తామని చెప్పి రూ. 68.68 కోట్లు ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం మాత్రం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి అందిస్తోంది.
* ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 40,000. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
* ఎస్సీలు కులాంతర వివాహం చేసుకుంటే గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
* ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
* ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
* బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 35,000. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 50,000
* బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000
* మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
* విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 1,00,000. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000
* భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 20,000. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 40,000
* మొదటి విడత జమ చేసిన తేదీ 10.02.2023. లబ్ధిదారులు 4,536, అందించిన మొత్తం రూ. 38.28 కోట్లు
* రెండవ విడత జమ చేసిన తేదీ 05.05.2023. లబ్ధిదారులు 12,132, అందించిన మొత్తం రూ. 87.32 కోట్లు
* మూడో విడత జమ చేసిన తేదీ 09.08.2023. లబ్ధిదారులు 18,883, అందించిన మొత్తం రూ.141.60 కోట్లు
* నాలుగో విడత జమ చేసిన తేదీ 23.11.2023. లబ్ధిదారులు 10,511, అందించిన మొత్తం రూ. 81.64 కోట్లు
* మొత్తం లబ్ధిదారులు 46,062, అందించిన మొత్తం రూ.348.84 కోట్లు.
ఇదీ చదవండి: Ayyappa swamy: తిరుమల ఘటన తర్వాత కేరళ అటవీ శాఖ హై అలర్ట్.. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక యాప్
