HomeAndhra PradeshInfosys In Vizag : విశాఖలో ఇన్ఫోసిస్‌.. లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్‌.. డిసెంబర్‌కల్లా సీఎంవో...

Infosys In Vizag : విశాఖలో ఇన్ఫోసిస్‌.. లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్‌.. డిసెంబర్‌కల్లా సీఎంవో షిప్ట్‌!

Infosys In Vizag : ఏపీ పరిపాలన రాజధాని విశాఖపట్నంలో ఐటీ డెవలప్‌మెంట్‌ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఇండస్ట్రియల్‌ హబ్‌గా అవతరించిన విశాఖ.. ఐటీలోనూ కీలక ముందడుగు వేసింది. మధురవాడ ఐటీ హిల్‌ నంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. (Infosys In Vizag)
ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

అనంతరం ఇన్ఫోసిస్‌ ప్రతినిధులను, సిబ్బందితో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.

* ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు నిరంజన్‌ రాయ్‌, నీలాద్రిప్రసాద్‌ మిశ్రా, ఇతర ఇన్ఫోసిస్‌ ప్రతినిధులకు, నా మంత్రివర్గ సహచరులకు, ఇతర అతిధులకు అభినందలు.
* ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవంలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది.
* విశాఖపట్నం నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్‌గా మారబోతోంది.


* ఆ స్థాయిలో ఈ నగరానికి సహాకారం అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేదు.
* ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖపట్నంలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం విశాఖలో ఉన్నప్పటికీ… ఈ కంపెనీలన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్‌ నగరంలోనే ఏర్పాటు అయ్యాయి.

* అప్పట్లో విశాఖపట్నానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినప్పటికీ ఏపీలో విశాఖపట్నం అతిపెద్ద నగరం. టయర్‌ వన్‌ సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి.
* విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటు అయ్యాయి. 14 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 8 యూనివర్సీలు, 4 మెడికల్‌ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖపట్నం ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారయింది.
* ఇక్కడ నుంచి ఏడాదికి దాదాపు 12వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు తమ డిగ్రీ పూర్తిచేసుకుని వస్తున్నారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్‌ లా యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖపట్నంలో ఉన్నాయి. ఇది విశాఖపట్నం సామర్ధ్యం.

* ఇక్కడే ఐఓసీ, దాదాపు 20వేల నేవల్‌ అధికారుల కుటుంబాలతో కూడిన ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ వంటి పబ్లిక్‌ సెక్టార్‌ సంస్ధలు కూడా ఉన్నాయి. తీరప్రాంత ఆధారిత మౌళికసదుపాయాలు, విశాఖపట్నం, గంగవరంలలో రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి.
* వీటితో పాటు శ్రీకాకుళంలో కూడా మూడో పోర్టు వస్తుంది. కేవలం మరో రెండేళ్లలోనే ఇక్కడ అత్యంత సుందరమైన అంతర్జాతీయ పౌర విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుంది.

* మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. నేను కూడా త్వరలోనే విశాఖకు షిప్ట్‌ అవుతాను. మా అధికారులు కార్యాలయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు.
* ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయ అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఇక్కడికే వస్తారు. డిసెంబరులోపు విశాఖకు మారుతాం. నేను కూడా విశాఖలోనే నివాసం ఉంటాను.

* టయర్‌ వన్‌ నగరంగా ఎదగడానికి ఈ రకమైన తోడ్పాడు విశాఖనగరానికి అవసరం. ఆ రకమైన తోడ్పాటును ఇన్ఫోసిస్‌ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నాను.
* 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యంతో ఉన్న ఇన్ఫోసిస్‌తో పాటు, టీసీఎస్, విప్రో వంటి సంస్ధలు ఏ నగరం ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని అయినా పూర్తిగా మార్చివేస్తాయి.
* ఇప్పుడు ఇన్ఫోసిస్‌ వస్తుంది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి.

* విశాఖలో ఆదానీ డేటాసెంటర్‌ కూడా రాబోతుంది.ఇంటర్నెట్‌ కేబుల్‌ మనకు ఎక్స్‌క్లూసివ్‌గా సింగ్‌పూర్‌ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్‌ రానుంది.
* క్లౌడింగ్‌తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్‌ వచ్చింది.

* నిరంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు వంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీళ్లంతా కచ్చితంగా ఒకరోజు విశాఖ ఐటీలో అద్భుతాలు సృష్టిస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది.
* ఇవాళ 1000 మందితో ఇక్కడ ప్రారంభం అయిన ఇన్ఫోసిస్‌… రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను.
* నేను కచ్చితంగా చెప్పగలను విశాఖ కలలను సాకారం చేసే లక్ష్యంగా నిలుస్తుంది.

* భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇన్ఫోసిస్‌తో కలిసి విశాఖ ఐటీ రంగంలో బహుముఖ ప్రగతిని సాధిస్తుంది. అందరికీ హృదయపూర్వక అభినందనలు.
* మీకు మరొక్కసారి హామీ ఇస్తున్నా ఏ అవసరం ఉన్నా… మేం కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉంటాం.
* దీన్ని దృష్టిలో పెట్టుకొండి. మీకు ఏ అవసరం వచ్చినా మీకు అండగా నిలబడతాం.” అని సీఎం జగన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: CM Jagan at Kakinada: బాబు పేరు చెబితే స్కాములు.. జగన్‌ పేరు చెబితే స్కీములు గుర్తుకొస్తాయి: సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు