HomeLife StyleClothes facts: చనిపోయిన వారి బట్టలు ఇంట్లోవాళ్లు వేసుకోవచ్చా? నిపుణుల అభిప్రాయం ఏంటి?

Clothes facts: చనిపోయిన వారి బట్టలు ఇంట్లోవాళ్లు వేసుకోవచ్చా? నిపుణుల అభిప్రాయం ఏంటి?

Clothes facts: ఇంట్లోని వారు చనిపోయిన సందర్భాల్లో వారి వస్తువులుగానీ, దుస్తులు గానీ బతికున్న కుటుంబ సభ్యులు ధరించవచ్చా? లేదా వినియోగించవచ్చా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంటుంది. కుటుంబ పెద్ద అయిన తండ్రి లేదా తల్లి, సోదరులు, సోదరీమణులు చనిపోయిన సందర్భాల్లో వారు బతికున్నప్పుడు ఎంతో ఇష్టంగా కొన్ని వస్తువులుగానీ, దుస్తులుగానీ వాడుతుంటారు. ఫలానా వస్తువు కొడుకు కొనిచ్చాడనో, ఫలానా లుంగీ లేదా డ్రస్‌ కూతురు తెచ్చి ఇచ్చిందనో పెద్దలు ఇష్టంగా ధరించి ఉంటారు. (Clothes facts)

ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన సందర్భాల్లో చాలా మంది కొన్నాళ్ల పాటు తీవ్ర మనో వేదనతో ఉండిపోతుంటారు. ముఖ్యంగా ఇంటి యజమాని అయిన తండ్రి లేదంటే తల్లి చనిపోతే ఆ కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. తర్వాత నెలకో రెండు నెలలకోగానీ మామూలు మనుషులు మారి, సమాజంలో కలిసిపోతుంటారు.

ఇలాంటి వస్తువులను వారి జ్ఞపకంగా కలకలం భద్రపరుచుకుంటూ ఉంటారు చాలా మంది వారసులు. అయితే, కొందరికి వీటిని ధరించాలని, వారి జ్ఞపకాలు తమతోనే నిరంతరం ఉండాలని భావిస్తుంటారు. ఇలాంటి తరుణంలో అవి ధరించవచ్చా? లేదా వారు వాడిన వాచీ, ఉంగరం, లేదా ఇతర వస్తువులు వినియోగించవచ్చా? అనే సందేహాలు చాలా మందిని వెంటాడుతుంటాయి.

వాడకపోవడమే మంచిదంటున్న పెద్దలు..
ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలీక చాలా మంది సతమతం అవుతుంటారు. అయితే, ఈ విషయంపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. చనిపోయిన వారి బట్టలుగానీ, చనిపోయిన వారి వస్తువులుగానీ బతికున్న వారి వారసులు వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఒక వేళ వాడితే ఎలాంటి ప్రయోజనాలు, దుష్పరిణామాలు ఉంటాయో మనం చెప్పలేమంటున్నారు. చనిపోయిన వారికి అవి అత్యంత ప్రీతిపాత్రంగా ఉండటం వల్ల మంచి ఫలితాలైనా కలగవచ్చని, లేదా వారి వస్తువులు వాడటం వల్ల నెగిటివ్‌ ఫలితాలూ కలిగే చాన్స్‌ ఉందంటున్నారు.

Read Also : Clothes: వేరొకరి దుస్తులు వేసుకుంటే ఏమవుతుంది? శాస్త్రం ఏం చెబుతోంది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు