Clothes: వేరొకరి దుస్తులు వేసుకుంటే ఏమవుతుంది? శాస్త్రం ఏం చెబుతోంది?

Clothes: అసలు రాత్రిపూట ధరించిన దుస్తులను మళ్లీ వేసుకోవరాదని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఒకసారి ధరించిన బట్టలు మళ్లీ ఉతికి ఆరేసుకొని ఐరన్‌ చేసుకున్నాకే ధరించాలని పెద్దలు చెబుతున్నారు. ఇది మన పూర్వీకులు సైతం చెప్పారని గుర్తు చేస్తున్నారు. రాత్రిపూట ధరించిన దుస్తులు ధరించడం, ఉతకని బట్టలే మళ్లీ ధరించడం వల్ల అనేక నెగిటివ్‌ ఎనర్జీలు మనపై ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతున్నారు. (Clothes)

మన ఇళ్లలో చాలా మంది విడిచిన బట్టలు పెద్దగా మాసిపోలేదనే సాకుతో మళ్లీ వేసుకుంటూ ఉంటారు. అలాగే రాత్రిపూట వేసుకున్న బట్టలు.. అంటే మగవాళ్లు నైట్‌ ప్యాంట్‌ లేదా లుంగీ, టీషర్ట్‌ లేదా బనియన్‌ లాంటివి ధరించి పడుకుంటూ ఉంటారు. అలాగే మహిళలు, యువతులైతే నైట్‌ ప్యాంట్‌, టీషర్ట్‌, లేదా నైటీ ధరించి పడుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మందికి అనేక అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి.

ఆడవాళ్లు పట్టు చీరల విషయంలో చాలా మందికి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఏదో ఒక ఫంక్షన్‌కు కాసేపు కాస్త విలువైన పట్టు చీరలు కట్టుకొని కాసేపు ఎండలో ఆరేసుకొని వాటిని జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు. మళ్లీ ఫంక్షన్ల సమయంలో బయటకు తీసి అదే చీరను కట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి తప్పనిసరి పరిస్థితులకు మినహాయింపు ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. అయితే, రాత్రిపూట వేసుకొని పడుకున్న దుస్తులను పొద్దున స్నానం చేసే సమయంలో తప్పనిసరిగా కాస్త జాడించి ఆరేసుకోవాలని, తర్వాతే వాటిని ధరించడం మంచిదని చెబుతున్నారు.

అలా దుస్తులు ధరించరాదు

అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు, బంధువుల బట్టలు ధరించాల్సి వచ్చిన సందర్భాల్లో కూడా వీలైనంత వరకు వాటిని ధరించకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఇలా ధరించడం వల్ల వారిలోని నెగిటివ్‌ ఎనర్జీ, బాడీ విడుదల చేసిన చమట, ఇలా అనేక రకాలైన ఇబ్బందులు వేసుకున్న వారికి వ్యాపిస్తాయి. అందుకే వీలైనంత వరకు మరొకరి దుస్తులు వేసుకోకుండా ఉండాలి. తప్పనిసరి అయిన సందర్భాల్లో కనీసం ఉతికిన బట్టలు ధరించేలా చూసుకోవాలి.

ఇదీ చదవండి: Others Things : ఇతరుల వస్తువులు వాడుతున్నారా? వాడితే జరిగేది ఇదే..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles