Central Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి ఇవీ.. (Central Cabinet Meeting)
* కీలక మార్గాల్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ లకు కేంద్ర కేబినెట్ ఆమోదం
* ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్ట్ లు
* గుంటూరు-బీబీనగర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు
*239 కి.మీ. మార్గం డబ్లింగ్ కు రూ.3,238 కోట్ల కేటాయింపు
* హైదరాబాద్-చెన్నై మధ్య తగ్గనున్న 76 కి.మీ దూరం
* ముద్కేడ్-మేడ్చల్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు
* మమబూబ్ నగర్-డోన్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు
* హైదరాబాద్-బెంగళూరు మధ్య తగ్గనున్న 50 కి.మీ దూరం
* ఏపీలో విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్ మీదుగా నెర్గుండి వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం
* విశాఖ-చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్ సిద్ధం
* పీఎం ఈ-బస్సు యోజనకు కేబినెట్ ఆమోదం
* 169 నగరాల్లో 10వేల ఈ-బస్సులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
* పీఎం విశ్వకర్మ నూతన పథకానికి కేబినెట్ ఆమోదం
* చేతివృత్తుల వారికి రూ.13 వేల కోట్ల ఆర్థిక సాయం
* 7 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ లకు కేంద్ర కేబినెట్ ఆమోదం
* ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్ట్ లు
* గుంటూరు-బీబీనగర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు
పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ‘పీఎం ఈ-బస్ సేవ (PM-eBus Sewa)’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10వేల ఈ-బస్సులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో 169 పట్టణాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇందుకోసం రూ.57,613కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.20వేల కోట్లను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Good News for employees: విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపికబురు.. జీతం ఎంత పెంచారంటే..
