Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కోసం అదనపు నిధులు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్ సభలో వైసీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ బ్యాలెన్స్ వర్క్ ల కోసం రూ.10,911 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం పేర్కొంది. వరదల కారణంగా జరిగిన నష్టం రిపేర్ కోసం రూ. 2 వేల కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. (Polavaram Project)
కేబినెట్ అనుమతి తర్వాత నిధులు విడుదల ఉంటుందని కేంద్రం పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ – 1 పూర్తికి రూ. 17,144 కోట్లు అవసరమని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని కేంద్రం వెల్లడించింది. ఇందులో 36 గ్రామాల పునరావాస ప్యాకేజీ కూడా ఉందని క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి తర్వాత నిధులను దశలవారీగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 14,969 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ చేసిందని కేంద్ర జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు.
Read Also : CM Jagan At Polavaram: చిన్న సమస్యను విపత్తుగా చూపే దౌర్భాగ్యమైన మీడియా..! సీఎం జగన్ ఫైర్
