HomeBusinessGold rates today (15-07-2023): వెండి ధర కొండలా పెరిగిపోతోంది.. ఇవాళ్టి పసిడి, వెండి రేట్లు...

Gold rates today (15-07-2023): వెండి ధర కొండలా పెరిగిపోతోంది.. ఇవాళ్టి పసిడి, వెండి రేట్లు ఇవీ..

Gold rates today (15-07-2023): బంగారం ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర, అలాగే 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పు లేదు. వెండి ధర మాత్రం రూ.1500 పెరిగింది. గడచిన మూడు నెలల్లో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో పసిడికి ఇదే ఉత్తమ వారం. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఉండబోదన్న అంచనాలతో ఈ వారంలో పసిడి గణనీయంగా పుంజుకుంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,963 డాలర్ల వద్ద నమోదైంది. Gold rates today (15-07-2023)

తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇలా..

తెలంగాణలోని హైదరాబాద్‌ గోల్డ్‌ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,000గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,000 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.81,300 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర రూ.55,000 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.60,000 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.81,300 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.55,450 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,490 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.

దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ప్రైస్ రూ.55,000గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.60,000 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.55,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,150 గా నమోదైంది. జైపూర్‌, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.

మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర ఇవాళ రూ.420 పెరిగింది. రూ.25,610 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.

సాధారణంగా బంగారం, సిల్వర్‌ సహా ప్లాటినం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలంకరణ లోహాల్లో ప్రతి రోజూ ఈ మార్పులు సహజం. ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలు, వాణిజ్య కార్యకలాపాలపై వీటి ధరలు ఆధారపడి ఉంటాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో రేట్లు పెరగడం, లేదా తగ్గడం లాంటి పరిణామాలతో మనదేశంలోనూ మార్పులు జరుగుతాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల ధరలు పుంజుకొనేందుకు, తగ్గుదల నమోదు చేసేందుకు పలు కారణాలు ఉంటాయి.

ఏడాదిన్నరగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ వార్‌.. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ నేపథ్యంలో కొన్ని నెలలుగా అన్ని రకాల ధరలూ అమాంతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం స్టాక్, వడ్డీ రేట్ల హెచ్చు తగ్గులు.. ఇలా అనేక అంశాలు గోల్డ్‌ ప్రైస్‌ను నిర్దేశిస్తుంటాయి.

Read Also : Chandrayaan 3 : చంద్రయాన్‌ – 3 సక్సెస్‌.. మామా వచ్చేస్తున్నామంటున్న ఇస్రో.. అంబరమంటిన సంబరాలు..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు