HomeAndhra PradeshAmbati on pawan: వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు: మంత్రి అంబటి

Ambati on pawan: వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు: మంత్రి అంబటి

Ambati on pawan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. పవన్‌ వారాహి వాహనం ఎక్కి అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి.. పవన్‌పై సెటైర్లు వేశారు. పవన్ యాత్రలో అది వరాహం అయిపోతోందంటూ విమర్శించారు. మాట పై నిలకడలేని వ్యక్తిత్వం పవన్ కల్యాణ్ దని ఎద్దేవా చేశారు. పవన్ స్టార్ట్ చేసిన కామన్ మేన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏముంది? అని మంత్రి అంబటి ప్రశ్నించారు. (Ambati on pawan)

పవన్ అప్పుడే ఊగిపోతాడని.. అప్పుడే సాగిపోతాడంటూ అంబటి రాంబాబు విమర్శించారు. సంస్కారం కోసం పవన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చెప్పులు పట్టుకుని బూతులు మాట్లాడినప్పుడు సంస్కారం ఏముందంటూ చురకలంటించారు. పవన్ హద్దులు మీరి మాట్లాడుతున్నారని హెచ్చరించారు. వలంటీర్ల వ్యవస్థ గురించి దారుణంగా మాట్లాడుతున్నారని, ఇది ఎంత మాత్రం పద్ధతి కాదని హితవు పలికారు మంత్రి అంబటి.

Ambati Rambabu: పవన్‌కల్యాణ్‌పై అంబటి రాంబాబు ఫైర్

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని గత టీడీపీ ప్రభుత్వం వేధించిందని గుర్తు చేశారు మంత్రి అంబటి రాంబాబు. జగన్ ఎక్కడ మరోసారి అధికాంలోకి వస్తారేమో అని పవన్ భయపడిపోతున్నారని చెప్పారు. పిచ్చి కల్యాణ్… నీకు రాజకీయ భవిష్యత్ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పవన్‌ను ఆవహించిందన్నారు. పీఆర్పీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ను పంచలు ఊడదీసి కొడతానని అన్నారని గుర్తు చేశారు. అప్పుడే పవన్ రాజకీయాలకు పనికిరాడని ప్రజలు అనుకున్నారని తెలిపారు.

పవన్ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని అంబటి సెటైర్లు వేశారు. మాట పై నిలబడని వ్యక్తిత్వం పవన్‌ సొంతమన్నారు. పవన్ కల్యాణ్ సార్థక నామధేయుడని… బూతు పదాలు వాడిన పవన్‌.. సంస్కారం గురించి ఎలా మాట్లాడతావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. కాపులను రెచ్చగొట్టే కార్యక్రమం పవన్ చేస్తున్నారని, కాపుకుల రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన టీడీపీ పై కాపులు కోపంగా ఉన్నారని గుర్తు చేశారు.

Read Also : MP Margani Bharath: వలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారు.. : ఎంపీ మార్గాని భరత్

పవన్ డైలాగ్ లు సినిమా వరకే పనిచేస్తాయి: మాజీ మంత్రి వెలంపల్లి

పవన్‌ కల్యాణ్‌ వేస్తున్న డైలాగులు కేవలం సినిమాల్లోనే పనికొస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పవన్ కి డబ్బులిస్తే చాలు ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతాడన్నారు. రాష్ట్రంలో పవన్ కిరాయి రాజకీయాలు చేస్తున్నాడన్నారు. సీఎం జగన్ ను తిడితే కొన్ని పార్టీల నుంచి కిరాయి డబ్బులు ఎక్కువ వస్తాయని పవన్ ఆశ అన్నారు. ఆంధ్రాలో అడ్రస్ లేని వ్యక్తి కూడా ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్ల పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో పవన్ డోర్ నెంబర్ ఉందా? అని ప్రశ్నించారు వెలంపల్లి. అడ్రస్ ఉంటే వలంటీర్ల విలువ తెలిసేదని పేర్కొన్నారు.

Read Also : Minister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు