Project K: డార్లింగ్ ప్రభాస్ (Prabhas) వరుసపెట్టి మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత సలార్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా సలార్ మూవీ టీజర్ కూడా విడుదలైంది. ఇందులో హీరో ఎలివేషన్లు హైలెట్ అయిన సంగతి తెలిసిందే. అభిమానులకు పూనకాలు తెప్పించేలా సింపుల్ ఇంగ్లిష్ డైలాగ్స్‌తో సలార్ మూవీ టీజర్ ఆకట్టుకుంది. మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’పై అభిమానులకు గుడ్ న్యూస్ అందుతోంది. ఈ మూవీ టైటిల్ రివీల్‌పై ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. (Project K)
దీపికా పదుకొనే.. ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అమితాబ్ బచ్చన్, (Amitabh bachchan) కమల్ హాసన్ (Kamal Hassan) వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ అప్‌డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వచ్చింది.
‘ప్రాజెక్ట్-కే’ సినిమా పేరును ఇంటర్నేషనల్ వేదికపై అట్టహాసంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకల జరగనున్నాయి. అక్కడే జూలై 20న ప్రాజెక్ట్ కే టైటిల్‌తోపాటు గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమానికి డార్లింగ్ ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, (Deepika Padukone) దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), నిర్మాత అశ్వినీదత్ (Ashwini Dutt) కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు మొదలు పెట్టారు. ‘సలార్’ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోపే అభిమానులకు ఇలాంటి కబురు అందడంతో ‘ప్రాజెక్ట్-కె’ గ్లింప్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు అభిమానులు.
ఇక ‘ప్రాజెక్ట్ కే’లో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారని ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడనే వార్త గుప్పుమంటోంది. వాస్తవం ఏమిటనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే, ఈ మూవీలో నటించేందుకు కమల్ హాసన్ భారీ రిమ్యునరేషన్ కోరినట్లు తెలుస్తోంది. అలాగే, ఇందులో నటిస్తున్న ఇతర స్టార్స్‌కు కూడా నిర్మాతలు భారీగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్‌తోపాటు దిశా పటానీ కూడా స్పెషల్ రోల్‌లో నటిస్తోందట. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాణం చేస్తున్నారు.
ప్రాజెక్ట్ కే మూవీకి సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 70 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్, ప్రభాస్ మధ్య కీలక సీన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కూడా పూర్తయితే ఇక మూవీ సిద్ధం అయినట్లేనని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. ఇక అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె సీన్స్ మరో రెండు వారాల్లో షూటింగ్ పూర్తి చేసుకోనుందట. ఇక రిలీజ్ డేట్ మాత్రం చిత్ర బృందం వెల్లడించాల్సి ఉంది. ఇక ప్రాజెక్ట్ కే మూవీ రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సలార్ మూవీ కూడా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : Salaar Teaser: సలార్ టీజర్ రిలీజ్.. ఊరమాస్ ఎలివేషన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్ ఖాయం!
