Goddess Durga: ఆడవారికి పూలంటే మహా ప్రీతికరం. అన్ని రకాల పూలనూ ఆడవారు ఇష్టపడుతుంటారు. ప్రత్యేకించి పూజా విధానంలో పూలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. భగవంతుని సన్నిధికి చాలా పూలు చేరుతుంటాయి. ముఖ్యంగా మందారం పూలంటే దుర్గాదేవికి మహా ఇష్టమని పండితులు చెబుతున్నారు. మందారం పూలను చాలా మంది స్త్రీలు కూడా అమితంగా ఇష్టపడతారు. మందార పువ్వులలో ఎర్ర మందారపు పువ్వు అయితే దుర్గామాతకు (Goddess Durga) ప్రీతికరమైనదిగా చెబుతారు.
ఇంట్లో సుఖశాంతులు ఏర్పడాలన్నా, ఆర్థిక వృద్ధి జరిగి ఇంటిల్లిపాదీ సంతోషంగా జీవించాలన్నా మందారం మొక్కను నాటుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ విజయం సాధించడానికి సులవుగా మారుతుందని పెద్దలు చెబుతున్నారు. సూర్యభగవానుడిని కూడా మందార పువ్వులతో పూజిస్తారు. ఈ మందార పువ్వులను నీటిలో వేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించినట్లయితే శుభకాలు కలుగుతాయని ప్రతీతి. జాతకంలో ఎవరికైనా సూర్య స్థానంలో సమస్యలున్నట్లయితే అధిగమించవచ్చని సూచిస్తున్నారు. రోగాల బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు.
దుర్గమ్మను పూజించే వారు ఎర్రమందారాలతో పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. కేవలం పూజకు పుష్పాలే కాదు.. ఎర్రమదారం పూల చెట్టును ఇంట్లో నాటుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. మందార పూల మొక్కను ఇంట్లో నాటడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ప్రసరించడంతో పాటు ప్రతికూలతను తొలగిస్తుందని స్పష్టం చేస్తున్నారు పెద్దలు.
సూర్యస్థానంలో దోషాలున్న వారు సూర్యభగవానుడికి ఎర్రమందారాలతో పూజలు చేసి, ఇంట్లో మొక్కను పెంచడం ద్వారా నివారణ చేసుకోవచ్చట. ఈ మొక్కను ఇంట్లో తూర్పు దిశలో నాటకం చాలా శుభ్రంగా చెబుతున్నారు. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగుతుందట. మందార పువ్వుల గుత్తులుగా పేర్చి అందంగా ఇంట్లో గదుల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మందార పువ్వులను పూజా సమయంలో దుర్గాదేవికి లక్ష్మీదేవికి హనుమంతుడికి సమర్పించడం వల్ల మంగళ దోషాన్ని తొలగిస్తుందని పండితులు స్పష్టం చేస్తున్నారు.
లోహుడనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరిస్తే లోహం పుట్టిందని చెబుతారు. కాబట్టే లోహాలతో తయారుచేసిన పరికరాలని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని అనాదిగా విశ్వసిస్తున్నారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయ్యింది. “దుర్గలోని ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. ‘గ’ అంటే నశింపజేసేది”, అని అర్థం.
ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు పటాపంచలవుతాయి. కాబట్టి, మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీ ఆరాధనతో సిరిసంపదలు, చివరి మూడురోజులు సరస్వతీ ఆరాధనతో సకల బాధలు తలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే దుర్గాష్టమి రోజున దుర్గసహస్రనామ పారాయణం, ‘దుం’ అను బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు ఏటా దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతాయి. కన్నుల పండువగా సాగే ఈ వేడుకలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. దుర్గమ్మను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతారు.
Read Also : Sri Venkateswara: కలియుగ వైకుంఠ నాథునికి ఎన్ని కోట్ల ఆస్తులంటే..
