కొబ్బరినూనె (Coconut Oil Benefits) సాధారణంగా తలకు రాసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ఇది ఇతర నూనెలన్నింటికంటే ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. కొబ్బరినూనెను (Coconut Oil Benefits) జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలతో పాటు చర్మ సంరక్షణ కూడా కలుగుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. కొబ్బరిని (Coconut Oil Benefits) ఆరోగ్య ప్రదాతగా అభివర్ణిస్తారు. పచ్చి కొబ్బరిని నేరుగా తింటారు. కొబ్బరి నీళ్లు తాగుతారు. కొబ్బరి నూనెను అనేక ప్రాంతాల్లో వంటలకు కూడా ఉపయోగిస్తారు.
మరోవైపు కొబ్బరి నూనెలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటి ద్వారా గ్లూకోజ్ టాలరెన్స్ ను మెరుగుపరచడం సులభతరమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీర్ణాశయం నుంచి నేరుగా కాలేయంలోకి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ వెళ్తాయంటున్నారు. వీటిని విచ్ఛిన్నం చేయడానికి మన శరీరంలోని వ్యవస్థకు శ్రమ అవసరం లేదంటున్నారు.
కొబ్బరినూనెతో మన శరీరంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కోకొనట్ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడం వల్ల థైరాయిడ్ లేదా జీవక్రియ పనితీరును నెమ్మదింపజేయడానికి దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల మనిషి బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.
కొబ్బరి నూనెలో యాంటీమైక్రోబయల్ గుణాలుంటాయి. ఇవి మన శరీరంలోని చెడు బ్యాక్టీరియాలను చంపేందుకు ఉపయోగపడతాయి. ఇవిగాక కోకొనట్ ఆయిల్ లో లారిక్ యాసిడ్ ఉంటుంది. మన ఒంట్లోని కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ కొబ్బరినూనె సాయపడుతుంది. కొబ్బరినూనెను ప్రతి రోజూ వాడటం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ను ప్రెగ్నెనోలోన్, ప్రొజెస్టిరాన్‌గా మార్చేందుకు ఉపయోగపడుతుంది. మన శరీరంలో అధిక కొలస్ట్రాల్ ఉన్నట్లయితే దాన్ని సాధారణ స్థితికి చేర్చడంలో కొబ్బరినూనె తనవంతు పాత్ర పోషిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలా కొబ్బరినూనె వాడటం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయని, రోజూ కొబ్బరినూనె వినియోగించాలని సూచిస్తున్నారు.
Snoring: గురక విపరీతంగా వస్తోందా? తగ్గించుకోవాలంటే ఇలాచేయండి..
మన ఇళ్లలో భార్యా భర్తల్లోనో చాలా మందికి గురపెట్టే అలవాటు ఉంటుంది. గురకపెట్టే వారు గుర్రుమంటూ బాగా నిద్రిస్తుంటారు. కానీ పక్కన పడుకున్న వారికే నరకంగా మారుతుంది. ఇక నిద్రలోకి జారుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇది కేవలం అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. మరో ప్రాంతంలోకి వెళ్లి నిద్రించే అవకాశం లేని వారికి ఈ కష్టం వర్ణనాతీతమే.

మనం బాగా నిద్రిస్తున్న సమయంలో గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గాన అడ్డంకులు ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలో గురక రావడం జరుగుతుంటుంది. గురక వచ్చిన సందర్భాల్లో నోటి ద్వారా శ్వాసను తీసుకుంటారు. ఈ మార్గంలోనూ ఇబ్బందులు ఎదురైతే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదిలి గురక శబ్దాలు వస్తాయి. ఇలా గురక రావడానికి చాలా కారణాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొందరికి నిద్రపోయే సమయంలో గురక రావడం అత్యంత సహజంగా జరిగిపోతుంటుంది. గురక అలవాటు లేని వారికి సైతం బాగా అలసిపోయిన సందర్భాల్లో ఆటోమేటిక్ గా గురక రావడం గమనిస్తుంటాం. ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే గురక సమస్య ఎక్కువగా చూస్తుంటాం. అయితే, అసలు గురక రావడం అనేది ఎందుకు జరుగుతుందో మొదట తెలుసుకోవాలి.
గురకను నివారించుకోవాలంటే వాయుమార్గం తెరుచుకొని ఉండాలి. ముక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. మనిషి వెల్లకిలా పడుకోవడం వల్ల ఎక్కువగా గురక వస్తుంటుంది. కాబట్టి ఓ పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. తల భాగం ఎత్తులో ఉండేలా పిల్లో వాడాలి. బెడ్రూమ్ ను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్ తాగడం లాంటివి మానుకోవాలి. నిద్రపోయే ముందు కాసిన్ని అటుకులు తింటే గురక తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ
