జర్నలిస్టుల ఆరోగ్యం (Journalist Health Camp) కోసం విజయవాడలో ఉచిత హెల్త్ క్యాంపు (Journalist Health Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. తొలిరోజు 1,120 మంది జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు (Journalist Health Camp) చేశారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందిన జర్నలిస్టులకు వైద్యులతో కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేశారు.

ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, విడదల రజిని హాజరయ్యారు. వీరితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్, ఆరోగ్యశ్రీ సిబ్బంది, 22 ఆస్పత్రుల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ శిబిరానికి మంచి స్పందన లభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వెల్లడించారు.

శనివారం విజయవాడలోని ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్ కాలేజీలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. 1,120 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. రెండు రోజులపాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. తొలిరోజు వైద్య పరీక్షలు చేయించుకున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల వైద్య రిపోర్ట్స్ వెలువడిన అనంతరం వైద్యులచే కన్సల్టేఫన్ ఉంటుందని తెలిపారు.

నిరంతరాయంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు వైద్య సేవలు అందించిన పిన్నమనేని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్మైల్ హాస్పిటల్, శంకర నేత్ర చికిత్సాలయ, మాక్స్ విజిన్ ఐ హాస్పిటల్, అన్షు ఆర్దో అండ్ ఈఎన్ టీ, ఆంధ్రా హాస్పిటల్స్, సెంటిని హాస్పిటల్, కామినేని, కేపిటల్ హాస్పిటల్, ఆపిల్ డెంటల్ కేర్ తదితర ఆస్పత్రులకు కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే పార్ధ డెంటల్ కేర్, ఉషా కార్డియాక్ సెంటర్, అమెరిక్ ఆంకాలజీ ఇన్ స్టిట్యూట్, ఇండో బ్రిటీష్ హాస్పిటల్, హెచ్ సీజీ క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్, గ్లోబల్ ఎంటర్ ప్రైసెస్ హార్ట్ కేర్ సెంటర్, సన్ రైజ్ హాస్పిటల్, స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ అను హాస్పిటల్, శ్రీధర్ డెంటల్ హాస్పిటల్, మణిపాల్, గ్రేస్ హా క్యాన్సర్ మొబైల్ కేర్ యూనిట్స్ ఆస్పత్రుల యాజమాన్యానికి కమిషనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read Also : Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విక్టరీ
