ఇంట్లో ఎలాంటి బల్బులు (Lights In House) వేసుకోవాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా వాస్తు శాస్త్ర నియమాలు సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయని చెబుతారు. కాబట్టి ఇంట్లోని ప్రతికూలతను పారదోలాలంటే పర్టికులర్ గా కొన్ని రకాల లైటింగ్స్ (Lights In House) వాడాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త ఇల్లు కట్టుకున్నా, లేదంటే కొత్త ఫ్లాట్ కొనుకున్న సందర్భాల్లో ఈ చిట్కాలు పాటిస్తే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతికూలతలు తొలగిపోయి సిరిసంపదలు చేకూరుతాయి.
1. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో అందమైన లైటింగ్, ఇంటీరియర్ డెకరేషన్లు ఉండేలా చూసుకుంటారు. షాన్డిలియర్స్, సైడ్ ల్యాంప్స్, డ్యాన్సింగ్ లైట్లు.. ఇలా రకరకాలు ట్రై చేస్తుంటారు.
2. ఇవి ఇంట్లోని వేర్వేరు ప్రాంతాల్లో డెకరేషన్ చేసుకుంటారు. ఇలాచేసుకోవడంతో ఇల్లు కాంతి వంతంగా ఉంటుంది. ఇంట్లో అమర్చుకొనే కృత్రిమ లైటింగ్ విధానంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.
3. ఇంట్లో రంగుల రంగుల లైట్లు పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఇలా ఇంట్లోని మరే ప్రాంతంలోనూ చేయరాదట. కేవలం పూజ గదిలో మాత్రమే చేసుకోవాలి.
4. బెడ్రూమ్ లో కూడా రంగురంగుల వాటిని ఉంచుకోరాదు. ఇలా చేస్తే నిద్ర సరిగా పట్టదట. పూజ గదిలో జీరో బల్బులు కూడా వాడవచ్చు.
5. ఇంట్లోని ఇతర ప్రాంతాల్లో లేత తెలుపు రంగు బల్బులు వాడితే శాంతి నెలకొంటుందట. ఆహ్లాదం కూడా వస్తుందట.
6. లివింగ్ రూమ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు లేదా గదిలో పడమర దిశలో లైట్ ను ఎప్పుడూ అమర్చరాదు. హాలులో అయితే ఉత్తర దిశలో లైట్లు అమర్చడం మంచిదని చెబుతారు.
7. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. అలాగే బెడ్ రూమ్ విషయంలో భార్యా భర్తల మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే మంచం ఎదురుగా ఉన్న గోడపై లైట్స్ పెట్టుకోవాలి. బెడ్ రూమ్ దక్షిణ ప్రాంతం వైపు దీపాలు పెట్టడం మానుకోవాలి.
దశ తిరిగిపోవాలంటే.. వాస్తు శాస్త్రంలో ఈ కిటుకు పాటించండి
1. నేటి సమాజంలో డబ్బు ప్రతి ఒక్కరికీ ముఖ్యమే. డబ్బుంటేనే చాలా పనులు జరుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సౌకర్యవంతమైన జీవితం గడపగలుగుతారు.
2. పేదలైనా, మధ్య తరగతి వారైనా, కుబేరులైనా తెల్లారి లేస్తే డబ్బు వేటలోనే బతుకుతుంటారు. జీవితాలను శాసించేది డబ్బే కాబట్టి అందరూ డబ్బు సంపాదన మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు.
3. ఈ క్రమంలో కలిసి వచ్చే అంశాలపై కూడా ఫోకస్ పెడుతుంటారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి.
4. డబ్బు లేకపోతే చాలా అవసరాలు తీరవు. డబ్బుతోనే అన్నీ కొనలేకపోవచ్చు కానీ.. చాలా కొనేయచ్చు. కానీ కొందరు చాలా సంపాదిస్తూ ఉంటారు.
5. కానీ ఏమీ మిగలడం లేదని వాపోతుంటారు. మరికొందరికి సంపాదిద్దామన్నా అవకాశాలు లభించవు. ఒక్కసారి ధనయోగం మొదలైతే చాలు.. ఇక తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు చాలా మందికి.
6. సకల బాధలూ తీరిపోయి ఐశ్వర్యవంతులవుతారు. సిరిసంపదలు వెంట వెంటనే వచ్చేస్తుంటాయి.
7. వీలైంత త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే వాస్తు శాస్త్రంలో కొన్ని టిప్స్ ఉన్నాయి. మీ సుడి తిరిగిపోవాలంటే ఇవి పాటించాలని చెబుతున్నారు నిపుణులు.
8. మీరు నిద్రపోయే స్థలం.. ప్రవేశానికి దూరంగా గోడకు చివర్లో ఉన్నట్లయితే అక్కడ ఏదైనా లోహపు వస్తువును ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ స్థలాన్ని సంపద కేంద్రంగా చెబుతారు.
9. ఇలాంటి స్థలంలో గోడకు పగుళ్లు వస్తే వెంటనే మరమ్మతు చేయించుకోవాలట.
10. లాకర్లలో పాజిటివ్ ఎనర్జీ కోసం లక్ష్మీదేవి ఫొటో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బుకు ఎప్పుడూ లోటు రాదని చెబుతున్నారు.
11. అలాగే ఇంట్లో విరిగిన వస్తువులు, చెత్తను ఉంచుకోరాదు. అలా చేస్తే ప్రతికూలత ఏర్పడుతుంది. ఇంట్లో కొళాయి ఉన్నట్లయితే.. అది లీకేజీ కాకుండా చూసుకోవాలి.
12. వాస్తు ప్రకారం లీకేజీ అయ్యే ట్యాప్ ఉంటే మీ డబ్బు కూడా అలాగే వెళ్లిపోతుందని చెబుతారు.
Read Also : Vastu Tips: గృహంలో వాస్తు దోషాలున్నాయా? డబ్బుకు ఇబ్బందులా.. ఇలా చేస్తే దశ తిరిగిపోతుంది!