శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YSR Vardhanthi : వైయస్ వర్ధంతి.. YSR ఘాట్ వద్ద జగన్ నివాళి

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 2 సెప్టెంబర్ 2025

YSR Vardhanthi : ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఘన నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. (YSR Vardhanthi)

సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

ఇవీ చదవండి: YSR Vardhanthi : వైయస్ఆర్ వర్ధంతి.. సంక్షేమ సారథి ఆశయాలు నెరవేరాయా?
YSR Jayanthi : మరపురాని మహానేత.. వైయస్సార్ 76వ జయంతి

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading