బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Ravi Teja: విక్రమార్కుడు వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం.. రవితేజ తమ్ముడే లేకపోతే ఆ సినిమా పూర్తయ్యేది కాదా?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 30 జూలై 2026

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి. కానీ, ‘విక్రమార్కుడు’ రేంజ్ మాత్రం వేరు. ఈ సినిమాతోనే రవితేజ స్టార్‌డమ్ తారాస్థాయికి చేరి, టాలీవుడ్ టాప్ హీరోల సరసన నిలబెట్టింది. సాధారణంగా దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో ‘జక్కన్న టేకింగ్’ ఎక్కువ డామినేట్ చేస్తుంది. కానీ విక్రమార్కుడు విషయానికి వస్తే, రాజమౌళి డైరెక్షన్‌కి ఏమాత్రం తగ్గకుండా రవితేజ తన నటనతో అదరగొట్టారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. ‘అత్తిలి సత్తిబాబు’గా కామెడీ పండిస్తూనే, ‘విక్రమ్ సింగ్ రాథోడ్’గా చూపించిన రౌద్రం ప్రేక్షకాభిమానులను ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తూనే ఉంది.

డూప్‌గా రవితేజ తమ్ముడు భరత్!

అయితే ఈ బ్లాక్‌బస్టర్ సినిమా గురించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన నిజం ఉంది. ఈ సినిమాలో రవితేజకు డూప్‌గా ఆయన సొంత తమ్ముడు, నటుడు భరత్ నటించారు! ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలలో ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్నప్పుడు లేదా యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు కాంబినేషన్ షాట్స్ చాలా కీలకం. ఆ సమయంలో రవితేజ బాడీ లాంగ్వేజ్, కటౌట్‌కు సరిగ్గా సెట్ అయ్యే భరత్ డూప్‌గా నటించడం వల్ల ‘విక్రమార్కుడు’ షూటింగ్ చాలా వేగంగా, సులువుగా పూర్తయిందట.

సహాయ నటుడిగా.. వివాదాస్పద వ్యక్తిగా..

భరత్ రాజ్ కూడా తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడే. ‘ఒక సైన్యం’, ‘ఒక్కడే’, ‘డేంజర్’, ‘వీరభద్ర’, ‘ఢీ’, ‘రెడీ’, ‘ఏక్ నిరంజన్’, ‘దూకుడు’, ‘బాడీ గార్డ్’, ‘రామయ్య వస్తావయ్యా’ వంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో సహాయ నటుడిగా, విలన్‌గా మెప్పించాడు. అయితే, కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలోనే భరత్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా అప్పట్లో హైదరాబాద్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసుల్లో ఆయన పేరు తరచూ వినిపించడం చర్చనీయాంశంగా మారింది.

ఊహించని మలుపు.. రోడ్డు ప్రమాదంలో విషాదం

సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే భరత్ జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. 2017 జూన్ 24న రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ మండలం కోత్వాల్‌గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. ‘విక్రమార్కుడు’ లాంటి ఆల్-టైమ్ క్లాసిక్ హిట్‌లో అన్న రవితేజకు అండగా నిలిచి, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భరత్ అకాల మరణం అప్పట్లో సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read also: Ravi Teja: ‘ఇరుముడి’లో రవితేజ కూతురిగా కనిపించనున్న చిన్నారి ఎవరు? టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న నక్షత్ర గురించి ఆసక్తికర విషయాలు
Gajakesari Rajyog: జూలై తొలి వారంలో గజకేసరి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆదాయం డబుల్ అయ్యే అవకాశం!
Ravi Teja Movie : సంక్రాంతి హిట్ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధం.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading