Apple ginger tea: ఏడు రోజుల్లోనే బరువు తగ్గడం కోసం ఇలా చేయండి.. ఈ టీ తాగితే బెస్ట్‌ రిజల్ట్‌

మనలో ఎక్కువ మంది అధిక బరువుతో (Apple ginger tea) ఇబ్బంది పడుతుంటారు. సన్నగా, నాజూగ్గా ఉండాలని చాలా మంది కోరుకుంటుంటారు. బరువు పెరిగితే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. కానీ, సరైన డైట్ మెయిన్ టైన్ చేయడం అంటే మాటలు కాదు. నిత్య జీవితంలో మన పనుల్లో బిజీ కావడం వల్ల వేళకు తిండి తినడం చాలామందికి కష్టతరంగా ఉంటుంది. కానీ, సన్నగా అవ్వాలని మాత్రం కోరిక ఉంటుంది. దీని కోసం రకరకాల పద్ధతులు (Apple ginger tea) అనుసరిస్తుంటాం. ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ కనుక ఫాలో అయ్యారంటే వారంలో మీ బరువు తగ్గడం గ్యారెంటీ.

1. అధిక బరువును తగ్గించుకోవాలంటే యాపిల్ అల్లం టీ బెస్ట్ అంటున్నారు డైట్ నిపుణులు. అది ఎలా చేయాలో ఓ లుక్కేద్దాం రండి.

2. యాపిల్ చాలా మందికి ఇష్టమైన పండు. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు పెరగకుండా చేస్తుంది.

3. ఆకలిని తగ్గిస్తుంది. కానీ రోజూ యాపిల్ తినాలంటే కష్టమే. అయితే, వారంలో కొన్నిసార్లయినా యాపిల్ తినాలి.

4. యాపిల్ పండులో జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది.

5. మన దేహంలోని వ్యర్థాలు, హానికారక పదార్థాలను బయటకు పంపేందుకు దోహదం చేస్తుంది. యాపిల్ తో అల్లం కలిపి టీ చేసి తాగితే హెల్త్ కు చాలా మంచిది.

6. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్, షోగాల్స్, జింజెరాల్స్ వంటివి కొవ్వును త్వరగా కరిగిస్తాయి.

7. మనం తిన్న ఆహారంలో త్వరగా అరిగిపోని పదార్థాలుంటే వాటిని ఇట్టే అరిగించేస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి అల్లం చాలా మేలు చేస్తుంది.

8. యాపిల్ పండు తొక్క తీసి చిన్న ముక్కలుగా వేరు చేయండి. అంగుళం అల్లం ముక్క తీసుకొని మిక్సీలో మెత్తగా ఆడించండి.

9. మూడు కప్పుల నీరు తీసుకొని యాపిల్ ముక్కలు, అల్లం ముద్ద వేసి ఓ 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో మరిగించండి.

10. యాపిల్ ముక్కలు, అల్లం పూర్తిగా నీటిలో మునిగేలా చూసుకోండి. ఇక స్టౌ ఆపేసి ఆ నీరు చల్లబడ్డాక మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోండి.

11. ఇక యాపిల్ అల్లం టీ రెడీ. ఉదయాన్నే కాస్త వేడి చేసుకొని తాగండి. ఇక ఫలితాలు మీరే చూడండి.

******

Health tips: తక్కువ ఖర్చుతో హెల్తీ ఫుడ్ తయారు చేసుకోవాలా? ఇలా చేయండి..

సాధారణంగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. తక్కువ ఖర్చుతోనూ ఆరోగ్యం మన సొంతం చేసుకోవచ్చు. పోషకాహారం తక్కువ ఖర్చుతోనూ పొందవచ్చు. ఆరోగ్యకమరైన ఆహారం అంటే కేవలం ఖరీదైనదే కాదు. తక్కువ కాస్ట్ లోనూ ఎన్నో పోషకాలున్న ఫుడ్ అందుబాటులో ఉందంటున్నారు ప్రముఖ డైటీషియన్లు. అవేంటో మీరూ తెలుసుకోండి.

1. ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాల్లో పెసరపప్పు ఒకటి. ఇందులో క్యాలరీలు తక్కువ.

2. వీటిలో ఉండే పోషకాలు మనిషి శరీరంలోని కండరాలను బలంగా తయారు చేయడంలో దోహదపడతాయి.

3. పెసరసప్పు తింటే కడుపులో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

4. పెసర్లు రాత్రిపూట ఓ గిన్నెలో వేసి అందులో నీటిని పోసి ఉదయాన్నే మొలకెత్తిన వాటిని తింటే మంచి ఆరోగ్యం మనసొంతమవుతుంది.

5. ఈ మొలకల్లో బి-విటమిన్, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం లాంటి పోషక విలువలుంటాయి.

6. పెసర మొలకల్లో ఉండే పదార్థాలు మన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.

7. మన ఆరోగ్యానికి ఆకుకూరలు రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. ఆకుకూరల్లో పాలకూర అంటే చాలా మందికి ఇష్టం.

8. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఫైబర్, ఫ్యాట్, ప్రొటీన్, ఏ,సీ,ఈ,కే విటమిన్లు పొదిగి ఉంటాయి.

9. అలాగే క్యాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి.

10. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు క్యాన్సర్ల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి.

11. అలాగే శనగలు కూడా మనకు తక్కువ ధరకే దొరకుతాయి. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

12. వీటిని మన రోజువారీ మెనూలో చేర్చుకోవాల్సిందేనంటారు డైటీషియన్లు.

13. బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుదల లాంటి అనేక ప్రయోజనాలు శనగలు తీసుకోవడం వల్ల ఉంటాయి.

14. వీటితోపాటు సిరిధాన్యాలు, అరటి పండ్లు కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు పోషకాలు మెండుగా లభిస్తాయి.

*****

lemon leaves: నిమ్మ ఆకులతో కలిగే లాభాలు తెలిస్తే షాక్‌ అవుతారు..

నిమ్మకాయ అందరి జీవితాల్లో జీవితంలో భాగమైందంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యానికి దివ్యౌషధంగా ఇది పని చేస్తుంది. అలాగే నిమ్మ ఆకులతో కూడా బోలెడు లాభాలున్నాయని మీకు తెలుసా? రోజూ నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నిమ్మ ఆకులను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి1, వివిధ రకాల ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, ప్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్ సహా అనేక పోషక విలువలన్నాయి.

1. నిమ్మ ఆకులు వాసన చూస్తే చాలా రకాల ప్రయోజనాలు కూడాఉన్నాయి.

2. వీటిలో యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటెల్మింటిక్, యాంటీ ఫ్లాట్యులెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా దొరుకుతాయి.

3. ఈ విషయాలు అనేక అధ్యయనాల్లో సైతం నిరూపితమయ్యాయి.

4. ఎన్సీబీఐలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, నిమ్మ ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లు లేకుండా, పెరగకుండా నిరోధిస్తుందని వెల్లడైంది.

5. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ నిమ్మ ఆకు దివ్యౌషధంగా పని చేస్తుంది.

6. అలాగే మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. తలనొప్పిలో కూడా అనేక రకాలున్నాయి.

7. ఎక్కువ సేపు కంప్యూటర్ పై పని చేసే వారికి తలనొప్పి వస్తుంటుంది.

8. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నిమ్మ ఆకులు వాసన చూస్తే తక్షణం రిలీఫ్ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

9. నిద్ర పట్టకపోవడం, చికాకుగా ఉండటం లాంటి సమస్యలకూ నిమ్మ ఆకు వాసన చూడటం బెస్ట్ టిప్ అంటున్నారు.

10. బరువు తగ్గడానికి కూడా నిమ్మ ఆకులు, నిమ్మ కాయలు వాడవచ్చు. నీటిలో నిమ్మ ఆకులు వేసి మరిగించి టీ తయారు చేసుకొని తాగొచ్చు.

11. స్నానం చేసేటప్పుడు కూడా వేడి నీటిలో కాసిన్ని నిమ్మ ఆకులు వేసి స్నానం చేస్తే చర్మ సమస్యలూ తగ్గుతాయి.

*****
Cholesterol control: కొవ్వును కరిగించాలా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

మన శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ స్థాయిలో ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మనకు తెలియకుండానే కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. అది ఎలాంటి సగ్నల్స్ లేకుండానే మన శరీరాన్ని డ్యామేజీ చేసేస్తుంది. మనకు ఏ గుండెజబ్బు లాంటిదో వచ్చినప్పుడు మాత్రమే కొలెస్ట్రాల్ ఎక్కువైందని తెలుస్తుంది. అధిక కొవ్వు శాతం మన ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అలాంటి కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం చాలా కష్టమైన పని అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం పత్పనిసరి.

1. బాడీలో కొవ్వు శాతం ఎక్కువైతే కొన్ని లక్షణాలు మనకు తెలిసిపోతాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల హై బీపీ వస్తుంది.

2. కరోనరీ హార్ట్ డిసీజ్ కూడా సోకే ప్రమాదం ఉంది. గుండె పోటు, పెరిపెరల్ వాస్కులర్ వ్యాధులు వస్తాయి.

3. ఇది డయాబెటిస్ తో ముడి పడి ఉంటుంది. మరి ఇంతటి ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ శాతాన్ని సరైన సమయానికి గుర్తించడం అవసరమని గుండె నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4. రక్తంలో కొవ్వు ఉందని గుర్తించాక దాన్ని అనేక మార్గాల ద్వారా తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

5. అధిక కొవ్వును కరిగించి సాధారణ స్థితికి చేర్చడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు.

6. జీవనశైలి మార్పులు, బరువుపై నియంత్రణ అనేవి కొలెస్ట్రాల్ స్థాయిలను డిసైడ్ చేస్తాయి.

7. ముఖ్యంగా తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వ్యాధులు దరిచేరకూడదంటే నియంత్రణ పాటించాలి.

8. చెడు కొవ్వును పెంచే ఆహార పదార్థాలను కచ్చితంగా తప్పించాలి. ఫాస్ట్ ఫుడ్ ను వీలైనంత మేర తగ్గించాలి.

9. ఇంట్లో తాజాగా వండుకున్న పదార్థాలైతే బెటర్. ఆకుకూరలు గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తాయి.

10. బీన్స్, బెండ, వెజిటబుల్ ఆయిల్స్, ఓట్స్, పండ్లు తీసుకోవాలి. తగిన వ్యాయామం కూడా ఉండాలి.

11. ఎన్నిసార్లు జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేదనుకున్నప్పుడు త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.

12. వీలైనంత వరకు సిగరెట్, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిది. రోజులో కొంత సమయం కుటుంబంతో సరదాగా గడపడం నేర్చుకోవాలి.

13. రోజులో కాసేపైనా నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.

*****

fatty liver disease: లివర్ ఫ్యాట్‌ను కరిగించడం కోసం ఏం చేయాలి?

శరీరంలో లివర్ ఫ్యాట్ సమస్య చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా ఆల్కహాల్ అలవాటున్న వారికి లివర్ సమస్యలు రావడం కామన్. కానీ మందు తాగని వారికి కూడా ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అవి గుర్తించే లోపే చాలా వరకు లివర్ దెబ్బతిని ఉంటుంది. భారత్ లో 9 శాతం నుంచి 32 శాతం మంది ఈ ఫ్యాటీ లివర్ జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని అంచనా. మరి దీన్ని నివారించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..

1. సాధారణంగా లివర్ లో కొవ్వు పరిమిత స్థాయిలో ఉంటే ప్రమాదమేమీ ఉండదు. కానీ, పరిమితి మించితేనే అన్ని చిక్కులు వస్తాయి.

2. లివర్ దెబ్బతింటుంది. లివర్ బరువులో కొవ్వు 5 నుంచి 10 శాతం మించరాదు. ఈ పరిమితి దాటితే స్టీటోసిస్ బారిన పడతారు.

3. అదనపు కొవ్వు పేరుకుపోతే హెపాటిక్ స్టీటోసిస్ అని పిలుస్తారు. వీటి లక్షణాలు బయటకు కనిపించకపోవడం మనకు పెద్ద మైనస్.

4. అందుచేత రోగాన్ని గుర్తించడం అంత త్వరగా జరగదు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

5. అయితే, ఈ ఫ్యాటీ లివర్ సమస్యకు దూరంగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాద కారకాలను నియంత్రించాలి.

6. ముఖ్యంగా నిద్ర అలవాట్లు మార్చుకోవాలని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

7. ఎన్సీబీఐలో ప్రచురితమైన ఓ నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

8. చెడు ఆహార అలవాట్ల వల్లనే ఈ ఫ్యాటీ లివర్ సమస్యలొస్తాయని నివేదిక తేల్చింది.

9. సరిగా నిద్రపోకున్నా, పగటిపూట ఎక్కువ పడుకున్నా ఈ సమస్యలు అధికంగా వస్తాయని చెప్పింది.

10. తగినంత నిద్ర ఉంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని తెలిపింది. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం ప్రధానమని పేర్కొంది.

11. నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవద్దని నివేదిక సూచించింది. బెడ్ రూమ్ లో ప్రశాంతత ఉండేలా చూసుకోవాలంది.

12. అప్పుడే నిద్ర హాయిగా పడుతుందని తెలిపింది. రోజూ కొంత వ్యాయామం చేయాలని, పడుకొనే ముందు ఫోన్లు పక్కన పెట్టేయాలని హెచ్చరించింది.

Also Read : Veedhi Potu : వీధిపోట్ల గురించి తెలుసా? కొన్ని చాలా ప్రమాదకరం అవేంటంటే..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles