యవ్వన వయసులో చర్మ సౌందర్యం (Health Tip 30 Years) అందరికీ బాగుంటుంది. అయితే క్రమంగా వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం, డ్రైగా మారడం, ముఖం డల్ గా కనిపించడం లాంటివి ఎవరికైనా తప్పవు. వయసు పెరిగే కొద్దీ (Health Tip 30 Years) తేజస్సు తగ్గిపోతుంటుంది. నల్లటి మచ్చలు, కళ్ల కింద ముడతలు వస్తూ ఉంటాయి. వీటిని అధిగమించి నేచురల్ చర్మం కనిపించేలా, ముడతలు లేకుండా ఉండేలా చూసుకోవడం కోసం కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు బ్యూటీషియన్లు.
1. చర్మం ముడతలు బారుతోందని చెప్పడానికి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది.
2. అందులో భాగమే 30 సంవత్సరాలు దాటాక రూపురేఖలు మారుతూ ఉంటాయి.
3. తెల్ల వెంట్రుకలు రావడం, శరీరం పనితీరు మందగించడం లాంటివి జరుగుంటాయి.
4. జీర్ణ క్రియ తగ్గడం, శక్తి కోల్పోవడం, అలసట పెరుగుతూ ఉంటుంది.
5. ముఖ్యంగా చర్మంపై మచ్చలు, ఫైన్ లైన్స్ వంటివి ముఖంపై కనిపిస్తుంటాయి.
6. వీటిన్నింటినీ దాటుకొని యవ్వనంగా కనిపించాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి.
7. మీరు తీసుకొనే ఆహారం మిమ్మల్ని, మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.
8. పౌష్టికాహారమైన ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే చర్మం నిత్య యవ్వనంగా కనిపిస్తుంది.
9. రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం కూడా చర్మ సౌందర్యానికి ప్లస్ అవుతుంది.
10. చర్మాన్ని మృదువుగా, దృఢంగా ఉంచుకోవాలంటే కొల్లా జెన్ ప్రొటీన్ అవసరం.
11. వయసు పెరిగే కొద్దీ మనలో ఈ ప్రొటీన్ ఉత్పత్తి తగ్గుతుంటుంది.
12. విటమిన్ సి బాగా ఉండే ఆహారం తీసుకుంటే ఈ లోటును పూడ్చవచ్చు.
13. విటమిన్ సి ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల యాంటీ ఏజ్ లక్షణాలు కనిపించవు.
14. సూర్య రశ్మి మన శరీరంపై పడుతుండాలి. అప్పుడప్పుడు ఫేషియల్ మసాజ్ చేయించుకుంటూ ఉండాలి.
15. వ్యాయామం చేయడం వల్ల కూడా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
Also Read : Others Things : ఇతరుల వస్తువులు వాడుతున్నారా? వాడితే జరిగేది ఇదే..!
[…] Health Tip 30 Years : 30 ఏళ్లకే చర్మంపై ముడతలు పడుతు… […]
[…] Also Read : Health Tip 30 Years : 30 ఏళ్లకే చర్మంపై ముడతలు పడుతు… […]