Tirumala News 02-08-2023: తిరుమలలో నిన్న కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా శ్రీవారికి దర్శనం చేసుకొనే వీలు భక్తులకు కలిగింది. నిన్న భక్తుల తాకిడి బాగా తగ్గింది. అయితే నేటి ఉదయానికి మాత్రం భక్తుల సంఖ్య పెరిగింది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,728 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న శ్రీవారికి 21,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.24 కోట్లు చేకూరింది. (Tirumala News 02-08-2023)
శ్రీవాణి ట్రస్టుపై నిజనిర్ధారణకు అనుమతి
శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న దుష్ప్రచారానికి తెరదించేలా తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. ఇందుకు టీటీడీ అనుమతించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక పురాతన ఆలయాల జీర్ణోద్ధరణతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి టీటీడీ నిధులు అందజేస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం కూడా చేస్తోంది. శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారం చేస్తుండడంతో ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొందరు ఆరోపణలు చేయడం మానలేదు. ఈ నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు మీడియా నిజనిర్ధారణ కమిటీకి టీటీడీ అనుమతి ఇచ్చింది.
టీటీడీ సీనియర్ న్యాయవాదిగా రఘు
తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసులు వాదించేందుకు సీనియర్ న్యాయవాది నియమితులయ్యారు. ఈమేరకు సీనియర్ లాయర్ రఘును నియమిస్తూ టీటీడీ లా అధికారి వీర్రాజు ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also : Inorbit mall Vizag: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. విశాఖలో నేడు శంకుస్థాపన