ఆదివారం, 20 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Life Style, Telangana

Village: ఇదో వింత గ్రామం.. మధ్యాహ్నానికే చీకటి.. దేవుడు లేని ఆలయం

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 5 నవంబర్ 2024

Village: పచ్చని చెట్లు.. పంట పొలాలు.. పశువులు.. పక్షుల కిలకిలా రావాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ గ్రామం. (Village) అక్కడి మనుషులు కూడా కల్లాకపటం లేకుండా ఆప్యాయంగా కనిపిస్తుంటారు. పచ్చదనంతో నిండిన ఆ ఊరిపై సూర్యుడికి కనికరం లేదంటే నమ్ముతారా?

అంతే కాదు.. అక్కడ ఆలయం ఉంది కానీ ఆ ఆలయంలో దేవుడు లేడు. ఏడాదికి ఒకసారి మాత్రమే దేవుడు దర్శనమిస్తాడంటే నమ్ముతారా? అక్కడ సూర్యోదయం 8 గంటల తర్వాతే. శతాబ్దాల కాలంగా అక్కడ ఇదే పరిస్థితి. గ్రామ ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోయారు. మరి ఇంతటి ఆసక్తికరమైన గ్రామం ఎక్కడుంది? దాని విశేషాలు ఇవీ..

ఈ విచిత్ర గ్రామం తెలంగాణలో ఉంది. పెద్దపల్లి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని సుల్తానాబాద్ మండలంలో కొదురుపాక అనే గ్రామంలో ఇది జరుగుతోంది. అక్కడ సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడు. అస్తమయం మాత్రం చాలా త్వరగానే ఉంటుంది. అందుకే ఈ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాక అని కూడా పిలుస్తుంటారు.

ఇప్పుడిదే ట్రెండింగ్
ఇటీవల విడుదలైన “క” సినిమాలో నాలుగు గంటలకే చీకటి పడుతుంది. ‘ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది… మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతోంది’.. అని హీరో ప్రశ్నిస్తాడు.. “మా ఊరు చుట్టూతా ఎత్తయిన కొండలున్నాయి.. కొండల మధ్య మా ఊరు ఉంది.. మధ్యాహ్నం మూడు అయ్యేసరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి ఆ నీడ మా ఊరి మీద పడి.. మూడింటికల్లా చీకటి పడిపోతుంది అబ్బాయి..’అని ఒక పెద్దాయన సమాధానమిస్తాడు. దీంతో అలాంటి ఊరు ఎక్కడుందంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

రెండు వింతలు
ఎక్కడైనా సరే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చీకటి స్టార్ట్ అవుతుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం వీటన్నిటికీ భిన్నంగా సాయంత్రం నాలుగింటికే చీకటి అలుముకుంటుంది. అంతేకాదు.. ఇక్కడ సూర్యోదయం కూడా గంట ఆలస్యంగా కావడం మరో విశేషం.

ఈ వింతకి కారణం
ఈ కొదురుపాక గ్రామానికి నాలుగు వైపులా గుట్టలు ఉంటాయి. ఈ గుట్టలు సూర్యోదయం, సూర్యాస్తమయాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. గ్రామానికి తూర్పున ఉండే గొల్లగుట్ట సూర్యోదయంపై ప్రభావం చూపుతోంది. పశ్చిమాన ఉండే రంగనాయకుల గుట్ట కారణంగా గ్రామాన్ని తొందరగా చీకటి కప్పేస్తుంది. అక్కడ ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ వింత జరుగుతోంది. ఈ పరిస్థితులకు అలవాటు పడిన ఆ గ్రామస్తులు చీకటి పడే సమయాని కల్లా బయటి పనులు ముగించుకుని ఇళ్లకు తిరిగి వచ్చేస్తుంటారు.

దేవుడు లేని తొలి ఆలయం
ఈ గ్రామంలోని మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ ఆలయం ఉంది కానీ.. ఆ ఆలయంలో దేవుడు ఉండడు. ఏడాదిలో ఒకసారి మాత్రమే ఇక్కడ దేవుడు దర్శనమిస్తాడు. దసరా పండుగకు దేవునిపల్లి నుంచి నంబులాద్రి నరసింహస్వామి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. రథయాత్రతో స్వామివారిని తీసుకొచ్చి ఉత్సవాలు జరుపుకున్నాక.. మర్నాడు దేవునిపల్లికి స్వామివారిని పంపిస్తారు. ఇది ఇక్కడ తరతరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ.

ఇవీ చదవండి: Telangana: ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ విడుదల
Maoist Hidma: ఆ గ్రామంలో 77 ఏళ్ల తర్వాత తొలిసారి ఎగిరిన జాతీయ జెండా..
ST Commission: గిరిజనులకు వారి గ్రామంలోనే ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యం
China President: చైనాలో ముందెన్నడూ లేని వింత పరిస్థితి.. యువతులు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ అధ్యక్షుడి వేడుకోలు
Iraq: ఆ దేశంలో అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చట!

ట్యాగ్స్: , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading