CM Jagan Speech: జనవరి నుంచి మరో మూడు మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నిన్న వైయస్సార్‌సీపీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. (CM Jagan Speech)
1. పింఛన్ పెంపు సంబరాలు
– జనవరి 1న నా అవ్వ తాతలకు, నా వితంతు అక్కచెల్లెమ్మలకు పెన్షన్ పెంపు కార్యక్రమం.
– 3 వేల దాకా పెంచుకుంటూ పోతాం అని చెప్పే కార్యక్రమం.
– గ్రామ స్థాయిలో 10 రోజులపాటు సంబరాలు.
– అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు వీళ్లందరి సంతోషాల్లో మీరందరూ భాగస్వాములు కావాలి.
– ఎన్నికలకు ముందు వరకు కేవలం 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే.. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడని అవ్వాతాతకు చెప్పాలి.
– నాడు పెన్షన్ల ఖర్చు నెలకు కేవలం రూ.400 కోట్లు. ఈరోజు చిరునవ్వుతో మీబిడ్డ ప్రభుత్వం భరిస్తున్న భారం నెలకు సుమారు రూ.2 వేల కోట్లు.
2. వైయస్సార్ చేయూత సంబరాలు
– జనవరి 10 నుంచి 20 వరకు.
– ప్రతి గ్రామంలో నా ఎస్సీ,నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వైయస్సార్ చేయూత ద్వారా మూడు దఫాల్లో రూ.14,129 కోట్లు ఇచ్చాం.
– జనవరిలో ఇవ్వబోయే మరో రూ.5 వేల కోట్లు కలుపుకొంటే.. మొత్తం రూ.19 వేల కోట్లు.
– ప్రతి అక్కచెల్లెమ్మలకూ వరుసగా ప్రతి సంవత్సరం రూ.18,750, నాలుగు సంవత్సరాల్లో రూ.75 వేలు చేతిలో పెడుతూ, బ్యాంకు రుణాలను ఇప్పిస్తూ, చేయి పట్టుకొని నడిపిస్తున్నాం.
– ఆర్థిక సాధికారత కలిగించే ఈ కార్యక్రమంపై గ్రామంలో అక్కచెల్లెమ్మలు చెప్పే విజయ గాథలు అందరికీ తెలియజేస్తూ పండుగ వాతావరణంలో భాగస్వాములు కావాలి.
3. వైయస్సార్ ఆసరా సంబరాలు
– జనవరి 20 నుంచి 30 వరకు.
– రూ.19,178 కోట్లు ఇప్పటికే మూడు దఫాల్లో ఇచ్చాం.
– చివరి విడతగా మరో రూ.6,500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇస్తాం.
– వైయస్సార్ ఆసరా ద్వారా రూ.26 వేల కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం.
– సున్నా వడ్డీ ద్వారా మరో రూ.5 వేల కోట్లు ఇచ్చాం.
– మొత్తంగా పొదుపు సంఘాల మహిళలకు మొత్తం అక్షరాలా రూ.31 వేల కోట్లను చేతిలో పెట్టిన విషయాన్ని చెప్పి వాళ్ల ఆశీస్సులు తీసుకోవాలి.
ఇదీ చదవండి: YSRCP Meeting: నాలుగు కార్యక్రమాల ద్వారా ఇకపై నిత్యం ప్రజల్లోనే!
