CWC 2023 Final: వన్డే వరల్డ్ కప్ 2023ని ఆస్ట్రేలియా తన్నుకుపోయింది. ఆరోసారి తమ దేశానికి అంతర్జాతీయ వన్డే వరల్డ్ కప్‌ను అందించారు కంగారూలు. అనుకున్నట్లుగానే ఈ ప్రపంచకప్‌లో మొదట కంగారూలు కాస్త నెమ్మదిగా ఆడినా, తర్వాత మ్యాచుల్లో విజృంభించారు. ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ తర్వాతే అసలు సిసలు కంగారూల ఆట ప్రేక్షకులు చవిచూశారు. ప్రతి ఆటగాడూ ఓ వజ్రంలా తయారై ప్రత్యర్థి జట్టుకుచుక్కలు చూపించేలా ప్రదర్శన ఇచ్చారు. ఫైనల్లో భారత్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. అప్పటి దాకా పదికి పది మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా.. నోటిదాకా వచ్చిన ఫుడ్‌ను మట్టిపాలు చేసుకున్నట్లయింది. (CWC 2023 Final)
ఫైనల్‌లో టీమిండియా అనుకున్నట్లుగానే కంగారు పడి కొంప ముంచేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాత్ కమిన్స్.. కాస్త తెలివిగా పిచ్‌కు అనుగుణంగా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్ శుభమన్ గిల్ మరోసారి నిరాశ పరిచాడు. షార్ట్ బాల్‌కు క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక కెప్టన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో ఆట కొనసాగించే ప్రయత్నం చేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ హిట్‌కు ప్రయత్నించి హెడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసుకొని 54 పరుగుల వద్ద ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్ చివరి దాకా పోరాడాడు. అయితే ఆఖర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుస్తాడన్న ఆశలను సమాధి చేస్తూ 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనూహ్యంగా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఎక్కువగా కీపర్ క్యాచ్‌లే ఉండటం గమనార్హం. ఇక సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడూ లేని విధంగా పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఆఖర్లో చెలరేగి ఆడాల్సింది పోయి అత్యంత దయనీయంగా కుల్‌దీప్‌యాదవ్‌కు స్ట్రైక్ ఇవ్వడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
మొత్తంగా టీమిండియాలో హిట్ మ్యాన్ ఒక్కడే మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో ధాటిగా ఆడిన పరిస్థితి. వికెట్లు పడే కొద్దీ భారత బ్యాటర్లలో భయం మొదలైపోయింది. అందుకే ఏ ఒక్క బ్యాటర్ కూడా చాన్స్ తీసుకోవడానికి ముందడుగు వేయలేకపోయాడు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
కంగారు పడ్డా స్వల్ప స్కోరును అవలీలగా కొట్టేశారు కంగారూలు. ట్రావిస్ హెడ్ 137 పరుగుల అజేయ సెంచరీతో ఆసీస్ విజయం నల్లేరు మీద నడక అయ్యింది. లబుషేన్ 57 పరుగుల భాగస్వామ్యంతో 43 ఓవర్లలోనే ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకుంది. మొత్తంగా భారత్ అభిమానులకు తీవ్ర నిరాశమిగిలింది.
ఎందుకీ వైఫల్యాలు?
వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న టీమిండియా అనూహ్యంగా ఫైనల్లో పరాజయం పాలవడానికి కారణాలు అనేకం ఉన్నాయి.
1. టాస్ ఓడిపోవడం.
2. మొదట బ్యాటింగ్ చేసిన సందర్భంగా వికెట్లు పడుతుండగా బ్యాటర్లలో ఆందోళన ఏర్పడడం
3. భారీ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో భారత్‌కు ఎంకరేజ్‌మెంట్ ఉన్నప్పటికీ ఆసీస్ జట్టు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లు వారి ఆట వాళ్లు ఆడారు.
4. భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోవడం.
5. మిడిలార్డర్ సరిగా లేకపోవడం. సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం.
6. భారమంతా మహ్మద్ షమీ, బుమ్రా, కోహ్లీ, హిట్ మ్యాన్‌పైనే పడటం.
7. ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్ తీరు మారకపోవడం.
సోషల్ టాక్
* మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
* రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్ర నిర్వేదంతో భారత్ అభిమానులు తల్లడిల్లారు.
* ఆసీస్‌కు ఇది ఆరో వన్డే వరల్డ్ కప్.
* పాత్ కమ్మిన్స్ కెప్టెన్సీ ప్రతిభ ఆకట్టుకుంది.
* రోహిత్ శర్మకు ఇదే ఆఖరి వన్డే వరల్డ్ కప్ అని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
* ఈ వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ 50 శతకాలు, సరికొత్త రికార్డులు బద్ధలు కొట్టాడు.
* మాజీ కెప్టన్ మహేంద్రసింగ్ ధోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మ్యాచ్‌ను తిలకించాడు.
Read Also : Karthika Pournami 2023: కార్తీక పౌర్ణమి విశిష్టత.. దీపారాధన ప్రాశస్త్యం.. పితృదేవతలు ప్రీతి చెందే మార్గం!