బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Shruti Haasan: పబ్లిక్‌లో శృతి హాసన్‌కు చేదు అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 21 ఏప్రిల్ 2026

Shruti Haasan: శృతి హాస‌న్ Shruti Haasan కు ఇటీవల ఓ కార్యక్రమం తర్వాత పబ్లిక్‌లో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానుల పేరుతో కొందరు చేసిన కామెంట్స్‌పై ఆమె అసహనం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

రోడ్డుపై కామెంట్స్.. శృతి హాసన్ ఆగ్రహం

ఓ ఈవెంట్‌లో పాల్గొని బయటకు వస్తున్న సమయంలో శృతి హాసన్‌ను చూసిన కొందరు వ్యక్తులు “మమ్మా… మమ్మా…” అంటూ గట్టిగా అరుస్తూ కామెంట్స్ చేశారు. ఇది విన్న శృతి ఒక్కసారిగా ఆగి స్పందించారు.

“కౌన్ హై మమ్మా..? హమ్ నే మమ్మ హై..? ఏం మాట్లాడుతున్నారు మీరు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడున్న వారిని ప్రశ్నిస్తూ “నీ బండి ఎక్కడ ఉంది?” అని అడిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది.

చాలా మంది నెటిజన్లు శృతి హాసన్‌కు మద్దతు తెలుపుతున్నారు. సెలబ్రిటీలను చూసి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్
సినిమాల విషయానికి వస్తే Shruti Haasan ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించలేదు. ఇటీవల Adivi Sesh హీరోగా తెరకెక్కుతున్న Dacoit సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

చివరిసారిగా ఆమె Rajinikanth నటించిన Coolie సినిమాలో కనిపించింది. ఈ సినిమా ద్వారా ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించింది.

శృతి హాసన్ పెళ్లి వార్తలు?
ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ పెళ్లిపై కోలీవుడ్‌లో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తండ్రి Kamal Haasan ఇప్పటికే వరుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఇప్పటికే శృతి హాసన్ వ్యక్తిగత జీవితంపై కూడా తరచూ వార్తలు వస్తుంటాయి. గతంలో ఆమెకు రెండు సార్లు బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పెళ్లి వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఆమె నుంచి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

View this post on Instagram

ఇవీ చ‌ద‌వండి: Shruti Haasan: ప్రేమలో ఆరు సార్లు విఫలం.. ఇకపై సింగిల్‌గా ఉండాలని నిర్ణయం: శ్రుతి హాసన్
Shruti Haasan: స్కూల్ డేస్ గుర్తు చేసుకున్న శ్రుతి హాసన్.. ఆ హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
Shruti Haasan : ‘ఆకాశంలో ఒక తార’లో శ్రుతి హాసన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. దుల్కర్ సల్మాన్ సరసన పవర్‌ఫుల్ పాత్ర… ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచిన మేకర్స్

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading