Sara Arjun: సారా అర్జున్ చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. నాన్న, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘ధురంధర్’తో హీరోయిన్‌గా బ్రేక్
ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమాతో సారా అర్జున్ హీరోయిన్‌గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో 40 ఏళ్ల హీరో రణ్‌వీర్ సింగ్‌కు జంటగా నటించి తన గ్లామర్, నటనతో అభిమానులను మెప్పించింది.
తెలుగులో కూడా ఎంట్రీ
సారా అర్జున్ తెలుగులో యూఫోరియా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలుగులో నటించడం తనకు చాలా గర్వంగా ఉందని తెలిపింది.
తండ్రి కూడా నటుడే
సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ కూడా ప్రముఖ నటుడు. ఆయన విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో క్రికెట్ సెలక్టర్ రమేశ్ రావు పాత్రలో నటించారు. అలాగే రజాకార్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు.
టాలీవుడ్‌లో ఫేవరేట్ హీరో ఎవరు?
టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ అని సారా అర్జున్ తెలిపింది. తన తండ్రి డియర్ కామ్రేడ్ సినిమాలో ఆయనతో కలిసి నటించడం వల్లే ఆయనపై ప్రత్యేక అభిమానం ఉందని చెప్పింది.
ఇవీ చదవండి: Sara Arjun: సారా అర్జున్‌ను ముద్దుపెట్టుకున్న వివాదం.. స్పందించిన నటుడు రాకేశ్ బేడీ
Radhika Sarathkumar: ఆ టికెట్ ధరలతో భారీ కలెక్షన్స్… రాధికా శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
Sara Arjun: Next Movie Rumours: ‘Heer Ranjha’ సినిమాలో నటిస్తుందా? కాస్టింగ్ డైరెక్టర్ క్లారిటీ..






