శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Ustad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి తీసేశారా..? రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ సాక్షి వైద్య

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 7 జనవరి 2026

Ustad Bhagat Singh : పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ Ustaad Bhagat Singh పై భారీ అంచనాలున్నాయి. ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాతో సంబంధించి హీరోయిన్ Sakshi Vaidya ను తప్పించారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఈ వార్తలపై సాక్షి తాజాగా స్పందించి స్పష్టత ఇచ్చారు.

హరీశ్ శంకర్–పవన్ కాంబోపై భారీ అంచనాలు

డైరెక్టర్ Harish Shankar దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్–హరీశ్ శంకర్ కాంబో మళ్లీ కలవడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ జోడిగా Sreeleela నటిస్తోంది. అయితే ప్రారంభంలో ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా ఉంటారని ప్రచారం నడవగా, ఆ తర్వాత ఆమెను తొలగించారనే వార్తలు వచ్చాయి.

“డేట్స్ ఇష్యూ వల్లే మిస్ అయ్యాను”

తాజా ఇంటర్వ్యూలో సాక్షి వైద్య ఈ రూమర్స్‌ను ఖండించారు.
“నా గత సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి తీసేశారనేది నిజం కాదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా బిజీగా ఉంటారు. డేట్స్ చాలా అరుదుగా ఇస్తారు. ఒకరోజు హరీశ్ శంకర్ గారు కాల్ చేసి ఎల్లుండే షూటింగ్ అన్నారు. ఆ సమయంలో నాకు ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండటంతో వారం రోజుల పాటు అందుబాటులో లేను. అదే కారణంగా షూటింగ్‌కు వెళ్లలేకపోయాను. డేట్స్ సమస్య వల్ల ఆ సినిమా మిస్ అయ్యింది” అని వివరించారు.

పవన్‌తో మళ్లీ ఛాన్స్ వస్తే మిస్ చేయను

“నా స్థానంలో వేరే హీరోయిన్‌ను తీసుకున్నారు. నేను ఇప్పటికే Surender Reddy దర్శకత్వంలో సినిమా చేశాను. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు. మళ్లీ పవన్ గారితో ఛాన్స్ వస్తే ఈసారి అస్సలు మిస్ చేయను” అని సాక్షి తెలిపారు.

సాక్షి వైద్య ప్రస్తుతం బిజీ

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మిస్ అయినప్పటికీ, సాక్షి వరుస ప్రాజెక్టులతో బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం Sharwanand హీరోగా నటిస్తున్న Nari Nari Naduma Murari చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.

పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ వేసవిలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

View this post on Instagram

ఇవీ చదవండి: Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తానంటున్న యంగ్ హీరోయిన్
OG Movie: తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ బెనిఫిట్ షోలు.. టికెట్ రేట్లు ఇలా!

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading