Teacher: టీచర్ పై కోపంతో కొందరు విద్యార్థులు ఏకంగా లేపేయాలని ప్రయత్నించారు. విద్యార్థుల క్షేమం కోరి కాస్త కటువుగా మాట్లాడే టీచర్లపై (Teacher) నేటి కాలం కొందరు పిల్లలు కక్ష పెంచుకుంటున్నారు. టీచర్ దండించిందన్న కోపంతో 12వ తరగతి విద్యార్థులు మహిళా సైన్సు టీచర్ పై పగ పెంచుకున్నారు.
టీచర్ కుర్చీ కింద బాణసంచా లాంటి ఓ బాంబును పెట్టి పేల్చేశారు. అయితే, సదరు టీచర్ చాకచక్యంగా వీరికుట్రను పసిగట్టి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన స్టూడెంట్స్ ను ప్రిన్సిపాల్ స్కూలు నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన హర్యాణాలో వెలుగు చూసింది.
హర్యానాలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ దండించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకునేందుకు స్కెచ్చేశారు. యూట్యూబ్ సహాయంతో ఫైర్ క్రాకర్స్ తరహాలో ఉండే పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసి దీన్ని తరగతి గదికి తీసుకొచ్చారు. అనుకున్న ప్రకారం, టీచర్ వచ్చి కుర్చీలో కూర్చోగానే ఒక విద్యార్థి కుర్చీకింద ఆ బాంబును సెట్ చేసి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
అయితే, టీచర్ వస్తుండగానే మరొకరు రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చాడు. భారీ శబ్దం వచ్చింది. అదృష్టవ శాత్తు కుర్చీలో ఆ టీచర్ కూర్చోకముందే ఈ దుర్ఘటన జరిగింది. తృటిలో టీచర్ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలికి తోటి లెక్చరర్లు బాసటగా నిలిచారు. ఆకతాయి పనులు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. బాంబు పేల్చడంలో పాలుపంచుకున్న 13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దాంతోపాటు విద్యా శాఖ అధికారులు వెంటనే పాఠశాలను సందర్శించి సమగ్ర విచారణ మొదలు పెట్టారు. పిల్లల తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పి, భవిష్యత్తులో ఈ విధంగా ప్రవర్తించబోరని హామీ ఇచ్చారు. ఘటన అనంతరం గ్రామంలో పంచాయతీ కూడా పెట్టి విద్యార్థుల వికృత చేష్టలపై చర్చలు జరిపారు. అయితే, విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా బాధిత టీచర్ ఆ 13 మంది విద్యార్థులను క్షమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: Crime News: కోడలి అక్రమ సంబంధం.. మందలించినందుకు అత్తను..
Telangana crime news: గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. పండుగ వేళ విషాదం
Crime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..
AP Crime News: తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో హత్యాచారాలు
