Number 46 in Numerology: సంఖ్యాశాస్త్రాన్ని నమ్మే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. జీవితంలో ఎంత కష్టపడినా తలరాత మారలేదనే వారు చాలా మందే ఉంటారు. కానీ తమ కళ్ల ఎదుటే తమకంటే తక్కువ కష్టపడేవారు అమాంతం ఆర్థికంగా ఎదిగిపోతుండటం కొందరు చూస్తుంటారు. వారి సక్సెస్ సీక్రెట్ ఏంటనేది అంతుపట్టక తమకూ అలాంటి కిటుకు తెలిస్తే బాగుణ్ను అని ఆలోచిస్తుంటారు. (Number 46 in Numerology)
ఇలాంటి వారి కోసం సంఖ్యా శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతోందని న్యూమరాలజీని నమ్మేవారు చెబుతుంటారు. నిజంగా న్యూమరాలజీకి అంత పవర్ ఉందా? సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి కరెక్షన్ తీసుకొని ఇంట్లో కూర్చుంటే ధనం వచ్చేస్తుందా? కష్టానికి న్యూమరాలజీ తోడైతే విజయం సాధ్యమా? ఈ కథనంలో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తిగత జాతకాలను బట్టి దోష నివారణ, పరిహారాలు చెబుతుంటారు పండితులు. అలాగే ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గురు చండాల యోగం, ఇతర దోషాలను తగ్గించుకొనేందుకు జ్యోతిష్యులు పలు మార్గాలను పూజా కార్యక్రమాలను సూచిస్తుంటారు. రాశి ఫలాల ప్రకారం ద్వాదశ రాశుల వారికి ముందుగానే ఫలితాలు తెలుసుకొనే వెసులుబాటు కలుగుతోంది.
Read Also : Vastu for Money: ఇలా చేస్తే దరిద్రం పోయి.. అదృష్టం కలిసి వస్తుంది
వీటి ప్రకారం తమకు ఏ ఇబ్బందులు కలుగుతున్నా జ్యోతిష్యశాస్త్రంలో పరిహారాలు పాటిస్తుంటారు. అయితే, సంఖ్యా శాస్త్రం పరంగా పేరులో కొద్దిగా మార్పులు చేసుకోవడం వల్ల జీవితంలో ఎదురవుతున్న కష్టాలు తీరుతాయని న్యూమరాలజిస్టులు భరోసా ఇస్తున్నారు. కష్టాలు తీవ్రమైన వారికి న్యూమరాలజీ ఆఖరి మెట్టు అని, దీన్ని ఫాలో అయితే తప్పక విజయం సాధిస్తారని చెబుతుంటారు.
ఇలా పేరు ప్రకారం ఏ నంబర్ వస్తుంది? పుట్టిన తేదీ, నక్షత్రాన్ని బట్టి వారి పేరు సక్రమంగా ఉందా? లేదా స్వల్ప కరెక్షన్ చేసి ఇన్ని రోజులపాటు ఒక నోట్ పుస్తకంలో కోర్సు రాసుకోవాలని సూచిస్తుంటారు. కోర్సు సక్రమంగా పూర్తి చేయడంతో పాటు నవరత్నాల్లో జాతకాన్ని బట్టి సదరు వ్యక్తులకు సరిపోయే వాటిని సూచిస్తుంటారు. వాటిని చేతివేళ్లకుగానీ, మెడలోడాలర్ రూపంలోగానీ ధరించాలని సూచిస్తుంటారు. వీటితోపాటు కష్టపడి తమ వృత్తిని చేసుకుంటే నెలల వ్యవధిలోనే మార్పు తథ్యమని చెబుతుంటారు.
ఇలా ఈ మధ్య కాలంలో న్యూమరాలజీ నిపుణులు బాగా బిజీ అయిపోయారు. వాటిని నమ్మిన వారు చాలా మంది సక్సెస్‌ఫుల్ కావడం, ఆ కేస్ స్టడీస్‌ను చూపించి మరింత ప్రచారం చేస్తుండడంతో న్యూమరాలజీని నమ్మేవారి సంఖ్య పెరుగుతోంది.
Read Also : Money Tips: ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలంటే.. ఉప్పుతో ఇలా చేయండి!
నంబర్ 46 సెల్‌ఫోన్ నంబర్ అయితే…
సెల్‌ఫోన్ నంబర్లు అన్నీ కలిపితే వచ్చే నంబర్‌ను తీసుకొని ఆ సంఖ్యా బలాన్ని బట్టి లక్కీ నంబర్‌ను చెబుతుంటారు. అంటే.. 9849123456 ఫోన్ నంబర్ అయితే 9+8+4+9+1+2+3+4+5+6 = 51 వస్తుంది. ఇలా అన్ని నంబర్లు కలిపినవి కొన్ని నంబర్లు లక్కీ అని, వాటిని మీ మొబైల్ నంబర్‌గా పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో మొదటి నంబర్ 46. మీ ఫోన్ నంబర్‌లోనంబర్లన్నీ కలిపితే 46 వచ్చేటట్లు ఉంటే ఇక వారికి తిరుగులేదని చెబుతున్నారు కొందరు నిపుణులు.
ఈ నంబర్ 46 ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు, సంస్థల పేర్లను కూడా న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. వారిలో మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్, బిశ్వరూప్ రాయ్‌చౌదరి, శివప్రసాద్ అనే పేరులో 46 నంబర్ ఉంటుందని చెబుతున్నారు. ఇలా చరిత్రలో ప్రముఖులంతా 46 నంబర్ కలిగిన వారని, 46 నంబర్ అంటే చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు.
నంబర్ 4లో కుబేరుడు ఉంటాడని, 6 అంటే సంపద, సమృద్ధి, లక్ష్మీదేవి అని అర్థమని చెబుతున్నారు. ఇలా మీ మొబైల్ నంబర్ 46 వచ్చేలా తీసుకుంటే ఏడాది అంతా సంపాదించే డబ్బు ఒక నెలలోనే సంపాదించగలుగుతారని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. ఇది పూర్తిగా న్యూమరాలజీని నమ్మేవారే అనుసరించాలని, డౌట్ ఉన్నవారు పాటించకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.
న్యూమరాలజిస్టుల సూచన ప్రకారం..
లక్కీ మొబైల్ నంబర్లు :
5, 6, 9 నంబర్లతో ఎండింగ్ అయితే పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది.
అన్‌లక్కీ నంబర్లు:
36
63
62
48లతో ఎండింగ్ అవ్వకూడదు.
Read Also : Money Tips in Astrology: అప్పుల బాధలన్నీ తీరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?