ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని కొందరు వాపోతుంటారు. అయితే, వాస్తు శాస్త్రంలో ఇలాంటి వారికి కొన్ని రెమెడీస్ (Vastu for Money) ఉన్నాయి. ఈ టిప్స్ పాటించడం వల్ల మీకు పట్టిన దరిద్రం పోయి అదృష్టం (Vastu for Money) కలిసి వచ్చేలా చేస్తుంది. మన ఇంట్లో, పరిసరాల్లోని గాలిలో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయని వాస్తు శాస్త్రం (Vastu for Money) చెబుతోంది. అయితే, నెగిటివ్ ఎనర్జీని ఎవరూ కోరుకోరు. పాజిటివ్ వైబ్స్ కావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
1. కొన్ని ఇళ్లు చూడటానికి చాలా అందంగా డిజైన్ చేసి కట్టుకొని ఉంటారు. అయితే, అలాంటి చాలా కుటుంబాల్లో సఖ్యత లోపించి ఉంటుంది.
2. ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని భావించాలి.
3. ముఖ్యంగా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తే ఇలాంటి ఘర్షణ వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
4. ఇంట్లోకి వచ్చే ప్రధాన ద్వారం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా శుభ్రత పాటించాలి.
5. మెయిన్ డోర్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ దరిచేరకుండా ఉంటుంది. కాబట్టి రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
6. విండ్ చిమ్స్ చాలా ఇళ్లలో ఉంటాయి. ఇవి చిన్న చిన్న శబ్ధాలు చేస్తూ ఉంటాయి. ఇవి నెగిటివ్ ఎనర్జీని పారదోలి సానుకూలతను చేకూర్చుతాయి.
7. ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడున్నా మాయమైపోతుంది. ఓ గిన్నెలో కాస్త ఉప్పు వేసి గదిలోని ఓ మూలన ఉంచితే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ వైబ్స్ వస్తాయి.
8. వారానికోసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే మంచి ఫలితాలు చూడవచ్చు. ఇంట్లో దేవుళ్ల ప్రతిమలు, యంత్రాల వంటివి ఉంచుకుంటే ప్రతికూలత రాకుండా ఉంటుంది.
9. అలాగే నిమ్మకాయను కోసి ఓ రెండు ముక్కలు తీసుకొని గ్లాసు నీటిలో ఉంచితే నెగిటివ్ ఎనర్జీని పీల్చేస్తుంది.
ఎంత సంపాదించినా నిలవడం లేదా? ఇలా చేయండి
చాలా మంది రోజూ డబ్బు సంపాదిస్తుంటారు. నెలకు జీతం తీసుకొనే ఉద్యోగులైనా, రోజువారీ వ్యాపారం చేసే వారైనా, బిజినెస్ మ్యాగ్నట్స్ అయినా.. సంపాదన కామన్. కానీ, చాలా మందికి ఎంత సంపాదించినా చేతిలో నిలబడటం లేదని చెబుతుంటారు. అలా నిలబడాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలట. ఎందుకంటే డబ్బు నిలబడితేనే కుటుంబం, భార్యా, పిల్లలు సంతోషంగా గడుపుతారు.
1. కొందరికి ఎంత సంపాదించినా ఊహించని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. అహర్నిశలూ కష్టపడి సంపాదించిన సొమ్ము నిలబడటం కూడా ముఖ్యమే.
2. ఇంట్లో ఎప్పుడూ డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంటే అలాంటి వారు ఇంట్లో ఏడు గవ్వలను శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
3. ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం.. అంటే బీరువా లాకర్ లేదా మరే చోటైనా.. కొన్ని వస్తువులు ఉంచితే కూడా డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు కాకుండా ఉంటుందట.
4. కొత్త నోట్ల కట్టలోని ఓ నోటును ఇంటి లాకర్ లో ఉంచుకోవాలట. ఇవి పాతబడకుండా కొత్తగా ఉండేలా చూసుకోవాలి.
5. డబ్బుకు మారుపేరుగా కుబేరుడి పేరు చెబుతారు. ధనానికి దేవుడు ఆయనే కాబట్టి ఆయన అనుగ్రహం పొందాలి. కుబేరుడి చిత్రం లేదా విగ్రహాన్ని లాకర్లో ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
6. డబ్బు బాగా రావడంతో పాటు ఆర్థిక లావాదేవీలు, పరిస్థితి మెరుగవుతుంది. లాకర్ లో చిన్న అద్దం ఉన్నా మంచిది. మీరు లాకర్ తెరిచినప్పుడల్లా కనిపించేలా అద్దాన్ని లాకర్ లో ఉంచాలి.
7. అప్పుడు ధనలక్ష్మీ రెట్టింపు అవుతుంది. అయితే, లాకర్లో తాళం చెవులు, ఫొటోలు, ఇతర పత్రాలు వంటివి లాకర్లో ఉంచరాదు.
8. అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందట. అందుకే జాగ్రత్తలు పాటించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
Read Also : Vastu Tips: గృహంలో వాస్తు దోషాలున్నాయా? డబ్బుకు ఇబ్బందులా.. ఇలా చేస్తే దశ తిరిగిపోతుంది!