Fruits with salt: గడచిన రెండేళ్లుగా పండ్లు తినే వారి సంఖ్య పెరిగింది. అంతకు ముందు కరోనా బారిన పడిన వారు గానీ, కుటుంబసభ్యుల్లో కరోనా సోకిన వారు గానీ పోషకాహారం తీసుకోవాల్సిన ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటున్నారు. శరీరం బలంగా ఉంటేనే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రతి ఒక్కరిలో ఆరోగ్య జాగ్రత్తలు, నాణ్యమైన ఆహారం తీసుకోవడం అలవాటుగా మారిపోయాయి. (Fruits with salt)
సాధారణంగా ఫ్రూట్స్ మనకు బలాన్నిచ్చే మంచి పదార్థాలుగా చెబుతారు. పండ్లు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు పండ్లు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పండ్లలో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండటం వల్ల వైద్యులు కూడా తమ వద్దకు వచ్చే రోగులకు పండ్లు తినాలని చెబుతుంటారు.
రోజూ పండ్లను తింటే అనేక రోగాలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పండ్లలో విటమిన్లు, పోషకాలు దండిగా లభ్యం అవుతాయి. అలాంటప్పుడు ఫ్రూట్స్ ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో మనకు ఉన్న పోషకాల కొరత తీరుతుంది. నేటి కాలంలో గజి బిజి జీవితం గడుపుతున్నప్పటికీ ప్రతి ఒకకరూ ఆరోగ్యానికి అవసరమైన ఆహారం విషయంలో అవగాహన పెంచుకుంటున్నారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ పండ్లను తినే పద్ధతిని ఫాలో అవుతున్నారు. కొందరు ఉదయం పూట పండ్లను తింటుంటారు. మరికొందరు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఫ్రూట్స్ తినేందుకు ఇష్టపడుతుంటారు.
కొంతమంది పండ్లపై ఉప్పు చల్లి తింటుంటారు. అయితే, ఉప్పు కలిపిన పండ్లను తినడం తక్కువ ప్రయోజనకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు.
ఇందుకు కారణం మన శరీరానికి అధిక ఉప్పు చేరడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలట. ఇది శరీరానికి మేలు చేస్తుంది. మనం రోజూ తీసుకొనే ఫుడ్‌లో ఆటోమేటిక్‌గా ఇది లభిస్తుంది. ఈ క్రమంలో పండ్లపై ప్రత్యేకంగా ఉప్పు వేసుకొని తినడం వల్ల శరీరానికి అవసరానికి మించిన ఉప్పు వచ్చి చేరుతుంది. అధిక శాతం ఉప్పు తీసుకోవడం వల్ల గుండెకు, రక్తపోటుకు మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు.
వందలాది రకాల పండ్లు మనకు పోషకాహారాన్ని ఇస్తున్నాయి. మామిడి, పుచ్చ, ఆపిల్ లాంటివి రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి శ్రేయస్కరం అని అనాదిగా పెద్దలు చెబుతున్నారు. వీటిని కొంతమంది పండు మొత్తంగా గాని లేదా జామ్ ల రూపంలో తింటుంటారు. పండ్ల నుంచి ఐస్ క్రీమ్ లు, కేకులు కూడా తయారు చేస్తుంటారు. కొన్ని పండ్ల నుంచి తీసిన ఫలరసం జ్యూసుల రూపంలో తీసుకుంటాం. నిమ్మ రసం, ఆపిల్ రసం, ద్రాక్ష రసం లాంటివి ఈ కోవలోకి వస్తాయి. మరికొన్ని పండ్ల నుంచి ఆల్కహాల్ తయారు చేస్తారు. విస్కీ, బ్రాందీ లాంటివి తయారవుతాయి. ఆలివ్ పండ్ల నుంచి ఆలివ్ నూనె తీస్తారు. ఆపిల్ పండ్లనుండి వెనిగర్ తయారు చేస్తారు.
Read Also: Red Eyes: తరచూ కళ్లు ఎర్రగా మారుతున్నాయా? కారణాలు తెలుసుకోండి!