గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
National

PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి.. డబ్బు వచ్చిందో లేదో ఇలా చెక్‌ చేసుకోండి..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 29 ఫిబ్రవరి 2024

PM Kisan Samman Nidhi: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ పథకం కింద రూ.2,000 రైతుల ఖాతాల్లో జమ చేశారు. రూ.21 వేల కోట్లు బదిలీ చేస్తున్నట్లు యావత్మాల్‌లో జరిగిన సభలో ప్రధాని వెల్లడించారు. గత ఐదేళ్లలో 11.8 కోట్ల మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనం పొందారు. PM Kisan Samman Nidhi

ఈ పథకం ద్వారా రూ.2.81 లక్షల కోట్లు నేరుగా జమ చేశారు. పీఎం కిసాన్ యోజన 16వ విడత ప్రయోజనాన్ని 9 కోట్ల మంది రైతులకు ప్రధాని అందించారు. రైతులను ఆదుకోవడంతో పాటు తాజాగా రైతు ఉద్యమంపైనా మోదీ ఫోకస్‌ పెట్టారు. రైతులతోనూ చర్చలు జరిపారు.

గడచిన పదేళ్లు భారతదేశానికి స్వర్ణయుగం
ప్రధాని కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితర ముఖ్య నేతలు పార్టిసిపేట్‌ చేశారు. రైతులు, పేదలు, మహిళలు, యువత కోసం వివిధ పథకాలపై పనిచేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేశారు. గత దశాబ్ద కాలం మన దేశానికి స్వర్ణయుగం అని సీఎం ఏక్‌నాథ్ షిండే అభిప్రాయపడ్డారు.

ఏమిటీ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అన్నదాతల ఖాతాలకు రూ.6,000 నేరుగా లబ్ధి చేకూరుస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో వేస్తారు. ఈరోజు ప్రధాని రైతుల ఖాతాలకు రూ.2000 బదిలీ చేశారు. అయితే, ఇంకా ఈ-కేవైసీ చేసుకోని రైతులు, అలాగే, దరఖాస్తు ఫాం నింపేటప్పుడు మీ పేరు, తండ్రి పేరు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా మరేదైనా తప్పులు చేసిన వారికి ఈ పథకం ప్రయోజనాలు పొందలేరు.

డబ్బు వచ్చిందో లేదో ఎలా చూసుకోవాలంటే..
* పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెళ్లాలి.
* హోమ్‌పేజీలో సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
* తర్వాత క్యాప్చా ఎంటర్‌ చేయాలి. ‘గెట్ స్టేటస్’పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు మీ చెల్లింపు స్థితి మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

యాప్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు..
* పీఎం కిసాన్ మొబైల్ యాప్ హెల్ప్‌ కూడా తీసుకోవచ్చు.
* ముందుగా పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
* ఇప్పుడు ఓటీపీని నమోదు చేసి, ‘లాగిన్’పై క్లిక్ చేయాలి.
* ఆపై ‘బెనిఫిషియరీ స్టేటస్’పై క్లిక్ చేయాలి.
* మీ చెల్లింపు స్థితి మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇవీ చదవండి: PM Kisan amount: పీఎం కిసాన్‌ సొమ్ము రెండింతలు? రాజస్తాన్‌లో మాత్రమేనా? దేశమంతా పెంచుతారా? క్లారిటీ ఇదే!
PM Kisan: నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు జమ.. 14వ విడత సొమ్ము విడుదల
Child Aadhar: బ్లూ ఆధార్‌.. బాల ఆధార్‌.. ఎలా తీసుకోవాలి?
CM Review on Agriculture: అన్ని విధాలా ఆదుకుంటున్నాం.. వ్యవసాయంపై సమీక్షలో సీఎం జగన్‌
CM Jagan with Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులపై చర్చ

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading