శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
National

PM Kisan amount: పీఎం కిసాన్‌ సొమ్ము రెండింతలు? రాజస్తాన్‌లో మాత్రమేనా? దేశమంతా పెంచుతారా? క్లారిటీ ఇదే!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 22 నవంబర్ 2023

PM Kisan amount: దేశ వ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకొనేందుకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో ఎన్డీయే ప్రభుత్వం ఏటా నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 2019లో ఈ పథకం మొదలైంది. ఏటా మూడు విడతలుగా నాలుగు నెలలకోసారి 2 వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలను కేంద్రం ఈ సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పథకంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్‌ సొమ్మును రెట్టింపు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. (PM Kisan amount)

రాజస్తాన్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు వేల రూపాయలు ఇస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధిని రూ.12 వేలకు పెంచుతామని ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతోపాటు రైతన్నల కోసం బీజేపీ మేనిఫెస్టోలోఅనేక హామీలు గుప్పించారు. బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి రైతు విద్యా ప్రోత్సాహక పథకం కింద రైతుల పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గోధుమల ఎంఎస్‌పీపై రూ.200 బోనస్‌గా ఇచ్చి క్వింటాల్‌కు రూ.2,700 చొప్పున గోధుమలను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. మిల్లెట్, జొన్నలను కూడా MSP ధరలకే కొనుగోలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన రైతుల భూములకు తగిన పరిహారం అందజేస్తామన్నారు.

ఇక పీఎం కిసాన్‌ సొమ్మును రెట్టింపు చేస్తామన్న ప్రధాని హామీ రాజస్తాన్‌ రైతులకేనా? లేక దేశమంతా వర్తిస్తుందా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అందుకే రాజస్థాన్ బీజేపీ తీసుకున్న నిర్ణయం మేరకు పీఎం కిసాన్ సాయాన్ని ఆ రాష్ట్రంలోని రైతులకు రూ.12 వేలకు పెంచుతామని మోదీ చెప్పారు. పీఎం కిసాన్ 15 విడత సాయాన్ని నవంబర్ 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 8 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2,000 చొప్పున రిలీజ్‌ చేశారు. ఫిబ్రవరిలో 16వ విడత సాయాన్ని అందించనుంది కేంద్ర ప్రభుత్వం.

మరోవైపు ఇటు ఏపీలో పీఎం కిసాన్‌ సొమ్ము ఆరువేల రూపాయలకుతోడు వైయస్సార్‌ రైతు భరోసా కింద 7500 రూపాయలు జగన్‌ ప్రభుత్వం ఇస్తోంది. మొత్తంగా ఏపీ రైతాంగానికి ఇప్పుడు ఏడాదికి రూ.13500 అందుతోంది. ఇక తెలంగాణలో 8 వేల రూపాయలు ఇస్తున్నారు. దాన్ని రెట్టింపు చేసి 16 వేలు అందిస్తామని అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ ఇప్పటికే హామీ ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఈలోపు రైతులకు అనుకూలంగా ఎన్డీయే ప్రభుత్వం పీఎం కిసాన్‌ సొమ్ము రెట్టింపు ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తున్న కేంద్రం.. దాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. రూ.12 వేలు చేస్తామన్న ప్రధాని మాటలతో తమకూ ఈ సాయం అందుతుందని అన్నదాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. దానికి తోడు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇంతే మొత్తం ఇస్తామని ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోల్లో పొందుపరుస్తున్నాయి. ఏరకంగా చూసినా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో రైతన్నకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకం కలుగుతోందనే విశ్లేషణలు వస్తున్నాయి.

Read Also : National Media Awards 2023: నేషనల్ మీడియా అవార్డులు-2023కి ఎంట్రీల ఆహ్వానం

ట్యాగ్స్: , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading