NCRB: అమ్మాయిల మిస్సింగ్ కేసుల వెనుక ఏపీలో గ్రామ, వార్డు వలంటీర్లు ఉన్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు వలంటీర్ల పాత్ర వెలకట్టలేనిదిగా మారింది. (NCRB)
కరోనా సమయంలో నేరుగా బాధితుల ఇళ్లకే వెళ్లి వీరు అందించిన సేవలు అజరామరం. పింఛన్ల పంపిణీ, రేషన్ కార్డు మొదలుకొని ఏ రకమైన సర్టిఫికెట్ కావాలన్నా ప్రతి ఇంటికీ వారధిగా వలంటీర్లు పని చేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వీరిపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో వలంటీర్లు భగ్గుమన్నారు.
ఎక్కడికక్కడ పవన్‌పై నిరసన తెలుపుతున్నారు. పవన్ దిష్టిబొమ్మల దహనం, చిత్రపటాల కాల్చివేత చేశారు. మరోవైపు అధికార పార్టీ నేతలు కూడా పవన్‌పై మండిపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ పవన్ తన ఉనికిని మరింత ప్రశ్నార్థకం చేసుకుంటున్నారని హెచ్చరించారు.
మిస్సింగ్ కేసులపై వాస్తవాలేంటి…?
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశ వ్యాప్తంగా మిస్సింగ్ కేసుల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. అమ్మాయిల మిస్సింగ్ కేసుల్లో దేశ వ్యాప్తంగా తెలంగాణ 6వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది. రికవరీల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే ఏపీ రెండో ప్లేస్‌లోఉంది. 2021 ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం…
* దేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో 37,278 మిస్సింగ్ కేసులతో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. అక్కడ రికవరీ శాతం 65.9.
* మధ్యప్రదేశ్‌లో 35,638 మిస్సింగ్ కేసులతో మూడో ప్లేస్‌లో ఉంది. అక్కడ 51.6 శాతం రికవరీ పర్సెంటేజ్.
* పశ్చిమ బెంగాల్‌లో 30,611 కేసులతో మూడో స్థానంలో ఉంది. అక్కడ 45.4 శాతం రికవరీ నమోదైంది.
* రాజస్తాన్‌లో 20,029 మిస్సింగ్ కేసులతో నాలుగో ప్లేస్‌లో ఉండగా, అక్కడ రికవరీ శాతం 61.
* ఐదో ప్లేస్‌లో తమిళనాడు రాష్ట్రం ఉంది. అక్కడ 17,704 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ రికవరీ పర్సెంటేజ్ 70.1.
* ఆరో ప్లేస్‌లో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఇక్కడ 13,360 కేసులు నమోదైతే 87.8 శాతం రికవరీ నమోదవుతోంది.
* ఢిల్లీలో 13,072 కేసులతో ఏడో స్థానంలో ఉండగా, అక్కడ రికవరీ పర్సెంటేజ్ 34.9 మాత్రమే.
* ఒడిశాలో 12,986 కేసులతో ఎనిమిదో ప్లేస్‌లో ఉంది. అక్కడ రికవరీ శాతం 46.7.
* ఛత్తీస్‌గఢ్‌లో 12,109 కేసులతో తొమ్మిదో స్థానంలో ఉంది. 45.3 శాతం రికవరీతో ఉంది.
* కర్ణాటక రాష్ట్రం పదో ప్లేస్‌లో ఉంది. అక్కడ 10,962 కేసులు నమోదయ్యాయి. రికవరీ పర్సెంటేజ్ 77.9.
* ఆంధ్రప్రదేశ్‌లో 10,085 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. రికవరీ శాతం 78.
పవన్ కల్యాణ్ చెప్పిన రికార్డులు ముమ్మాటికీ తప్పని ఈ లెక్కలే చెబుతున్నాయి. గ్రామ వలంటీర్ వ్యవస్థ కేవలం ఏపీలో మాత్రమే ఉంది. అలాంటప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బెంగాల్, రాజస్తాన్… ఇలా 30 వేల కేసులపైగా ఎందుకు నమోదవుతాయి? పవన్ కల్యాణ్ ఆరోపణల ప్రకారం ఏపీలో వలంటీర్ వ్యవస్థ కారణంగా పది వేల కేసులే నమోదయ్యాయా? లేక వలంటీర్ల వల్లే దేశ వ్యాప్తంగా పోల్చితే ఏపీలో తక్కువ కేసులు నమోదవుతున్నాయా? ఏపీలో మిస్సింగ్ కేసులకు వలంటీర్లే కారణమైతే మిగతా రాష్ట్రాల్లో కారణం ఏంటి? ఇందుకు ఆయనే సమాధానం చెప్పాలి.
Read Also : Perni Nani: వలంటీర్లు చేస్తున్న సేవ కనిపించలేదా? ఇంత ఓర్వలేని తనమా? పవన్‌పై పేర్ని నాని మండిపాటు