వాస్తు శాస్త్రం (Vastu Tips) ప్రకారం ప్రతికూల శక్తి ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో సానుకూల ఫలితాల కోసం కొన్ని వస్తువులు వెంట తెచ్చుకుంటే మీ జీవితం సంతోషాలమయం అయ్యి తీరుతుంది. ఏయే వస్తువులతో వాస్తు (Vastu Tips) బాగుంటుందో మీరూ ఓ లుక్కేయండి.. ఇంట్లో తెల్ల జిల్లేడు మొక్కను నాటండి. తద్వారా శుభం జరుగుతుంది. ఈ మొక్కలో వినాయక స్వామి ఉంటాడట. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఇంట్లో ఈ మొక్క ఉంటే ప్రతి రంగంలో విజయం మీదే. ఆగ్నేయ దిశలో కాకుండా ఉత్తర దిశలో ఈ మొక్కను నాటాలని వాస్తు (Vastu Tips) పండితులు చెబుతున్నారు.
1. గృహమే కదా స్వర్గ సీమ అన్నారు పెద్దలు. ఏ గృహమైనా వాస్తు ప్రకారం ఉంటే ఆ ఇంట సంతోషాలు వెల్లివిరుస్తాయి.
2. ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం లేకపోతే ప్రతికూల శక్తి ప్రభావితం చూపుతుంది. ఇంట్లోని వ్యక్తులపై ఆ ప్రభావం పడుతుంది.
3. తద్వారా ఏ పనీ కలిసిరాకపోవడం, డబ్బు పుట్టకపోవడం, కొత్తది ఏది మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురుకావడం జరుగుతుంటాయి.
4. వృధా ఖర్చులూ పెరుగుతాయి. మరి ఇంతటి కష్టాలు కొనితెచ్చుకోకూడదంటూ ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం ఉంచుకుంటే సరి.
5. ఒక కన్ను కలిగిన కొబ్బరికాయను ఇంట్లో ఉంచుకోవాలి. దీన్ని శాంతి, శుభాలకు సూచకంగా చెబుతారు.
6. ఒక కన్ను కలిగిన కొబ్బరికాయను తెచ్చి, పసుపు, కుంకుమ రాసి, ఎరుపు రంగు వస్త్రం కట్టి పూజ గదిలో పెట్టి క్రమం తప్పక పూజిస్తే మంచి ఫలితాలు చూడవచ్చు.
7. మరో చిట్కా ఏంటంటే.. ఎర్రటి వస్త్రంలో పటికను కట్టి ఇంటికి గుమ్మంలో వేలాడదీయండి.
8. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
9. దుష్ట శక్తులు ఇంట్లోకి రావు. అలాగే పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని నిష్టతో రోజూ పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది.
10. నిత్యం అభిషేకాదులు నిర్వహించి, భక్తి శ్రద్ధలతో కొలవాలి. అప్పుడు మీరు అనుకున్న ఫలితం దక్కుతుందంటున్నారు వాస్తు నిపుణులు.
11. వాస్తు శాస్త్రాన్ని చాలా మంది నమ్ముతారు. అనేక మంది ఆచరిస్తారు. మంచి ఫలితాలు పొందుతుంటారు.
12. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఎలాంటి చిత్రపటాలు పెట్టుకుంటే మంచి ఫలితాలొస్తాయో చాలా మంది వాస్తు పండితులు యూట్యూబ్ వేదికగా చెబుతుంటారు.
13. వాస్తు శాస్ర్తం ప్రకారం మీ ఇంట్లో 7 గుర్రాల ఫొటోను ఉంచుకుంటే అత్యంత శుభప్రదమట. ఈ ఫొటోను పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చట. చాలా మందికి 7 లక్కీ నంబర్ కూడా.
14. ప్రతి ఒక్కరూ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
15. వాస్తు ప్రకారం నిర్మించుకోవడంతో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
16. మరికొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అలంకరణకు అందంగా ఉండటంతోపాటు వాస్తు బలం చేకూరుతుంది.
17. ఇలాంటిదే 7 గుర్రాల చిత్ర పటం. పరుగెత్తే ఏడు గుర్రాలు ఉన్న పటం ఇంట్లో ఉంటే సకల శుభప్రదాయినిగా భావిస్తారు.
18. ఏడు సంఖ్యలో చాలా విశిష్టతలున్నాయి. పెళ్లి సమయంలో ఏడడుగులు, ఆకాశంలో ఏడు రంగుల ఇంద్రధనస్సు, సప్త సముద్రాలు, సూర్య భగవానుడి రథంలో ఏడు గుర్రాలు, శనైశ్చరుని సంఖ్య, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఉండే కొండలు కూడా ఏడే.. ఇలా ఏడు సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఉంది.
19. ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటాన్ని దక్షిణం వైపు గోడపై ఉంచుకోవాలి. చిత్రపటంలో గుర్రాలన్నీ ఒకే వైపు ఉండేలా చూసుకోవాలి.
20. వాటిలో ముఖం ఇంటి వైపు, గుమ్మం వైపు ఉండరాదు. ఇంటి లోపలివైపు ఉండేలా చూసుకోవాలి. పడక గదిలో ఉంచరాదు.
21. వాస్తు ప్రకారమే ఉంచడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగి సిరిసంపదలతో తులతూగుతారు. లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. అలాగే ఇంటికి వాయువ్య దిశలో ఓ జత గుర్రాల విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. ఇది కూడా శుభప్రదం.
Read Also : Bedroom Vastu: పడక గదిలో ఎలాంటి వాస్తు ఉండాలి?