ఇల్లు కట్టుకొనే వారు తప్పనిసరిగా వాస్తు శాస్త్రం (Bedroom Vastu) ప్రకారం అన్నీ ఫాలో అవుతుంటారు. మన దేశంలో వాస్తుకు చాలా ప్రయారిటీ ఇస్తారు. వాస్తు ప్రకారం కట్టని గృహాలు (Bedroom Vastu) చాలా ఖర్చు పెట్టి నిర్మాణం చేసినా.. వాటిని ఏదో ఒక సందర్భంలో కూల్చి వేస్తూ ఉంటారు. అందుకే ముందే వాస్తు నియమాలు ఫాలో అయ్యి ఇంటిని నిర్మాంచుకోవాలంటున్నారు వాస్తు నిపుణులు. వాస్తు ప్రకారం ఉంటేనే నివాసానికి సౌకర్యంగా ఉంటుందని చెబుతారు. కొన్ని నిబంధనలు పాటిస్తే.. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
1. సాధారణంగా సొంతిల్లు కట్టుకోవడం చాలా మందికి జీవితంలో ఓ కల.
2. అలాంటిది నెరవేరే సందర్భం వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త చర్యలు పాటించాలి.
3. వాస్తు ప్రకారం పడక గదిలో ఏవి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మొదట తెలుసుకోవాలి.
4. భార్యా భర్తల సఖ్యత ఉండాలంటే వాస్తు టిప్స్ ఫాలో అవ్వాలి.
5. ముఖ్యంగా బెడ్ రూమ్ లో టీవీ, కంప్యూటర్ లాంటివి ఉంచుకోరాదట.
6. అలా చేసినట్లయితే వాస్తు దోషం తలెత్తుతుందట. పడక గది అంటే పీస్ ఫుల్ గా ఉండాలని చెబుతారు.
7. బెడ్ రూమ్ నైరుతి, దక్షిణం దిశలో ఉంచుకొనేలా ఏర్పాట్లు చేసుకుంటే బెటర్.
8. అలాగే చనిపోయిన వారి ఫొటోలు బెడ్ రూమ్ లో ఉంచుకోరాదట. అనవసర వస్తువులతో గదిని నింపరాదు.
9. పడక గదిలో దంపతుల మధ్య అన్యోన్యత పెరిగేలా డిజైన్ చేసుకోవాలి.
10. భార్య ఎప్పుడూ భర్తకు ఎడమవైపే పడుకోవాలి. లేకుంటే ఆ దాంపత్యంలో కలతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
11. సంసారం అల్లకల్లోలంగా మారకూడదంటే ఈ నియమం పాటించాలి.
12. మంచాలు రెండు మూడు కాకుండా ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి.
13. చెక్కతో చేసిన మంచమైతే ఇంకా మంచిది.
14. దక్షిణం వైపు తల, ఉత్తరం వైపున కాళ్లు చాపుకొని పడుకుంటే చాలా సమస్యలు దూరమవుతాయి.
Also Read : Couple Relationship : దంపతులు నిత్యం గొడవ పడుతున్నారా? ఈ టాపిక్స్ తీసుకురాకండి..