Vastu Tips for luck: కుటుంబం ఆనందంగా గడపడానికి, అభివృద్ధిలోకి రావడానికి, ఆర్థికాభివృద్ధికి, సిరిసంపదలకు, ఆరోగ్యానికి సంబంధించి కూడా వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు సూచించారు నిపుణులు. వీటిని పాటించడం ద్వారా ఇంటిల్లిపాది సంతోషంగా బతకవచ్చు. ప్రతి సమస్యకూ వాస్తు శాస్త్రంలో రెమెడీ సూచించారు. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో సూచించారు. (Vastu Tips for luck)
వాస్తు నిపుణుల సూచనల మేరకు ఇంటికి ఆగ్నేయ మూలలో ఆకుపచ్చని మొక్కలు పెట్టుకోవాలి. మీ ఇంట్లో గుండ్రటి ఆకారంలో ఉండే కుర్చీలు ఉంటే వెంటనే వాటిని దూరం చేసుకోండి. వాటిని వాడితే ఇంట్లో కలతలు వస్తాయని సూచిస్తున్నారు. చేస్తున్న వృత్తి, వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఈ పని వెంటనే చేయండి. ఈ పని చేయడం వల్ల మీకు అదృష్టం కూడా వరిస్తుంది.
వారానికోసారి ఇంట్లో కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేయడంతో ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఆవ నూనెతో దీపం పెట్టుకోవాలి. దీంతో పాటు లవంగాలను వేసి ఇంట్లో ఉంచాలి. దీంతో ఇంట్లోని వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. ప్రతి గురువారం తులసి చెట్టుకు నీరు పోసి పూజ చేయాలి. పాలను కూడా సమర్పించాలి. ఇలా చేస్తే ఏవైనా అవాంతరాలు ఎదురవుతుంటే తొలగిపోతాయి.
పెనంపై పాలు వేయండి.. శుభం కలుగుతుంది..
మీకు గురువుల చిత్ర పటాలు ఉన్నట్లయితే వాటిని లివింగ్ రూమ్ లేదా డ్రాయింగ్ గదిలో పెట్టుకోండి. వారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మీపై ఉండాలంటే ఇలా చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ఇంట్లో విరిగిపోయిన కుర్చీలు, చెత్త, అవసరం లేని వస్తువులు పెట్టుకోరాదని చెబుతున్నారు. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుందట. బెడ్ రూమ్ లో ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో రొట్టెలు కాల్చుతుంటే ముందుగా పెనంపై పాలు చల్లుకోవాలి. ఇలా చేయడం ద్వారా శుభం కలుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
Read Also : Vastu Rules for house: ఏ అంతస్తులో ఇల్లు తీసుకోవాలి? ధన ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి?