Cold Water Bath: సాధారణంగా చలికాలం వచ్చిందంటే వేడినీటి స్నానానికే ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇస్తారు. బయట వాతావరణం గజగజ వణికించేదిగా ఉంటుంది. ఇక చన్నీటి బకెట్ లో చేయి పెట్టాలంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. ఈ నేపథ్యంలో గీజర్లు, వాటర్ హీటర్లు విరివిగా ఉపయోగిస్తుంటారు. వెచ్చటి నీటితో స్నానం చేస్తూ రిలాక్స్ గా ఫీలవుతుంటారు. కానీ, ఈ చలికాలంలో వేడి నీటి కంటే చన్నీటితో స్నానం చేస్తేనే బోలెడు ఉపయోగాలుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. (Cold Water Bath)
చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోపలి వేడిని తగ్గిస్తుందట. మన బాడీలో సాధారణంగానే వేడి ఉంటుంది. ఈ నేపథ్యంలో దానిపై వేడి నీళ్లు పోసుకోవడం వల్ల మరింత వేడి పెరుగుతుందట. అయితే, చల్లటి నీటితో స్నానం చేస్తే మిమ్మల్ని లోపలి నుంచి వెచ్చగా ఉండేలా చేస్తుందట. వేడి నీటితో చేస్తే చర్మం ఉపరితలం వరకు మాత్రమే రిలాక్స్ గా ఉంటుందట. అదే కూల్ వాటర్ పోసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. ధమనులు బలంగా తయారవుతాయని చెబుతున్నారు.
ఉదయాన్నే శీతాకాలంలో బాత్ రూమ్ లోకి వెళ్లాలన్నా జంకే వారు చాలా మందే ఉంటారు. కొళాయి తిప్పాలంటే భయపడిపోతుంటారు. ఎందుకంటే అంత చల్లటి నీటిని వినియోగించి స్నానం చేయడం అంత కష్టం మరి. దీని వల్ల కొందరికి జలుబు, ఫీవర్ కూడా అటాక్ చేస్తుంటాయి. అయితే, కొందరు ఈ భయంతో అసలు స్నానం చేయడానికి కూడా ఇష్టపడరు. ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేస్తే చాలా రకాల ప్రయోజనాలున్నాయట.
చర్మ సమస్యలు దూరమవుతాయి..
చన్నీటితో చలికాలం స్నానంతో చర్మ సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. వేడి నీరు పోసుకుంటూ మొటిమలు, దద్దుర్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందట. చుండ్రు కూడా పెరుగుతుందంటున్నారు. చల్లటి నీరు ఉపయోగించడం వల్ల క్యూటికల్స్ చర్మంపై రంధ్రాలను బిగిస్తుందట. చర్మం, స్కాల్ప్ లోని రంధ్రాలను కూడా మూసివేస్తుందని చెబుతున్నారు. మురికి చేరకుండా అడ్డుకుంటుందని, సహజ నూనులు చర్మం నుంచి బయటకు వెళ్లకుండా చేస్తుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Night bath: రాత్రిపూట స్నానం చేయడం వల్ల ప్రయోజనాలివే..
