Vastu And Money: సాధారణంగా ఇంట్లో డబ్బును బీరువాలో దాచుకోవడం చాలా మంది చేసే పని. కొందరు పెట్టెల్లో కూడా దాచుకుంటూ ఉంటారు. బీరువాలు లేని వారు అల్మారాల్లోనూ డబ్బును ఉంచుతుంటారు. కొన్ని చోట్ల డబ్బు దాచుకున్నప్పటికీ కలిసిరాక ఇంట్లోడబ్బు నిలవకుండా, చేతిలోంచి జారిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. కొన్ని ఇళ్లలో దొంగతనాలు, దోపిడీలు జరిగి డబ్బుతోపాటు బంగారం నగలు కూడా చోరీకి గురవుతుంటాయి. సరైన దిశలో డబ్బును ఉంచకపోవడమే ఇందుకు కారణాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో డబ్బు ఏదిశలో దాచుకోవాలో తెలుసుకోవాలి. (Vastu And Money)
చాలా మందికి ఇంట్లో డబ్బులు దాచుకోవడం గురించి నిత్యం సందేహాలు వెంటాడుతూ ఉంటాయి. ఇంట్లో ఎలాంటి ప్రదేశాల్లో డబ్బును దాచుకోవాలి? వాస్తు శాస్త్రంలో ఇందుకు ఏవైనా ఉపాయాలు ఉన్నాయా? ఏ దిక్కులో ఉంచితే సంపద వృద్ధి కలుగుతుందనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. ఇలాంటి సందేహాలకు వాస్తు నిపుణులు ఉత్తమ పరిష్కార మార్గాలు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కులో డబ్బు దాస్తే శుభాలు కలుగుతాయో వివరిస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు, నగలు, విలువైన పత్రాలు, ఇతర డాక్యుమెంట్స్ అన్నీ దాచుకొనే బీరువా పశ్చిమం, వాయువ్యంలో ఉంచకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ దిశలో దాచితే ధన నష్టం, దొంగతనం జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయట. వాస్తులో వాయువ్య దిశ అనేది డబ్బుకు సంబంధించి మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం నగదును ఎప్పుడూ నైరుతి దిశలోనే ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దొంగతనాల భయం తగ్గుతుంది. ఈ దిశలో డబ్బును దాచిపెట్టినప్పుడు.. అక్కడ కిటికీలు, తలుపులు ఉండకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. ముఖ్యంగా ఉత్తరం గోడ, పడమటి గోడ రెండూ కలిసిన మూల అయిన వీధిలో బీరువా ఉంచినట్లయితే శుభం కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లవుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Bhakti: ఒకరి భక్తిపై మరొకరు జోక్యం చేసుకోవచ్చా? భక్తి మార్గంలో ఏది సరైంది?