Turmeric Tea: వంటింట్లో లభించే మొట్ట మొదటి వస్తువు పసుపు డబ్బా. పురాణ కాలం నుంచి పసుపు ప్రాశస్త్యాన్ని పెద్దలు చెబుతూ వస్తున్నారు. పసుపులో అనేక ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. అందుకే పసుపు లేకుండా ఏ వంటకం ఉండదంటే అతిశయోక్తి కాదేమో. పసుపుతో చాలా రకాల వంటలు తయారు చేస్తారు. వేడి పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల జలుబు, గొంతు, ముక్కులో సమస్యలుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. పసుపుతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. (Turmeric Tea)
ఇంతటి ప్రయోజనకారి అయిన పసుపుతో కొందరు టీ కూడా తయారు చేసుకొని తాగుతారు. పసుపులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మన శరీరానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. ప్రస్తుతం పసుపుతో టీ తాగడం సరికొత్త విధానంగా మారింది. హెల్తీ డ్రింక్ అయిన పసుపు టీ చేసుకోవడంపై అనేక మంది దృష్టిపెడుతున్నారు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
పసుపు యాంటీ బ్యాక్టీరియల్ అని అందరికీ తెలిసిందే. ఇక పసుపు టీ తాగడం వల్ల కూడా మన బాడీలో యాంటీ ఇన్‌ఫ్లమేరీ డ్రింక్‌గా పని చేస్తుంది. నేచురల్ టర్మరిక్ టీ శరీరంలో ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడి, శారీరక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపు టీ తాగడం వల్ల మూడ్ డిస్టబ్‌గా ఉన్న వారికి మంచి హషారు కలుగజేస్తుంది. దీంట్లో కర్కుమిన్ అనే పదార్థం ఉండటం వల్ల మానిక ఆరోగ్యం బెటర్ అవుతుంది. వేడి వేడిగా పసుపు టీ తీసుకోవడం వల్ల మట్టి వాసన వచ్చి ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు.
పసుపును నీటిలో వేసి మరిగించి అనంతరం టీగా తయారు చేసుకోవచ్చు. పసుపు టీ బ్యాగ్స్ కూడా ప్రస్తుతంమార్కెట్లో విరివిగా అందుబాటులోకి వచ్చాయి. గోల్డెన్ కలర్‌లో అందంగా, చిక్కగా కనిపించే ఈ పసుపు టీ పౌడర్.. మట్టి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. పసుపు టీ తీసుకోవడం వల్ల గుండెకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. టర్మరిక్ టీలో ఉండే సమ్మేళనాలు శరీరంలో రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయట. దాంతో పాటు పసుపు టీ రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవీ..