ఎసిడిటీ (Acidity Control) సమస్య చాలా మందిని బాధిస్తుంది. ఆఫీసుల్లో పని చేసుకొనే వారు, ఇంట్లో మహిళలూ ఈ ఇబ్బందితో సతమతమవుతుంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వారికి ఛాతిలో మంట, నొప్పితో ఏ పని చేయాలన్నా అసౌకర్యం కలుగుతుంది. కొన్ని సులభమైన చిట్కాలు పాటించి ఎసిడిటీ నుంచి విముక్తి (Acidity Control) పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
1. ఎసిడిటీ ఎందుకు వస్తుందో మొదట అందరూ తెలుసుకోవాలి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం, ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం పనిలో నిమగ్నం అయిపోవడం చాలా మంది చేస్తుంటారు. ఎసిడిటీ అటాక్ చేయడానికి ఇదే మొదటి కారణం అవుతుంది.
2. దీని తర్వాత కాఫీ, టీ, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ లాంటివి కూడా ఎసిడిటీకి కారణమని వైద్యులు చెబుతున్నారు.
3. ఇలాంటివన్నీ చేయడం వల్ల మన శరీరంలో ఆమ్లాల స్థాయి బాగా పెరిగిపోతుంది. దీంతో గుండెల్లో మంట మాదిరిగా అనిపిస్తుంది. యాసిడ్స్ రిఫ్లక్స్ అవుతాయి.
4. మనం తిన్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేసేది హైడ్రోక్లోరిన్. ఇది డీఫాల్ట్ గా మన శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
5. జీర్ణ క్రియను పూర్తి చేయడానికి ఇది దోహదం చేస్తుంది. డీహైడ్రేషన్, ఎక్కువగా మద్యం సేవించడం, తీవ్రమైన ఒత్తిడి, స్మోకింగ్ లాంటి వాటి వల్ల ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. దీని వల్లే ఎసిడిటీ సమస్య వస్తుంది.
6. పుల్లని త్రేన్పులు, కడుపు, గొంతులో మంట, మలబద్ధకం, వికారం, వాంతులు, వెక్కిళ్లు రావడం, అలసిపోతున్నట్లు అనిపించడం లాంటివి ఎసిడిటీ లక్షణాలుగా చెప్పొచ్చు.
7. దీని నివారణకు తులసి ఆకులు వాడవచ్చు. నాలుగైదు తులసి ఆకులు నీటిలో వేసుకొని మరిగించి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
8. సోంపూ కూడా ఆమ్లాలు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలోనూ శోషణ పెంచే శక్తి ఉంది.
9. మజ్జిగను కొత్తమీర ఆకులు కలిపి తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గిస్తుంది. బెల్లం తీసుకుంటే మెగ్నీషియం ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంటుంది.
ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తినండి..
1. మనం తీసుకొనే ఆహారంలో రోజూ చెడు కొలెస్ట్రాల్ కొద్ది మొత్తంలో చేరుతూ ఉంటుంది. అలాంటి కొవ్వు పదార్థాన్ని కరిగించాలంటే అనేక పద్ధతులు అవలంభించవచ్చు.
2. చెడు కొలెస్ట్రాల్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. గుండె జబ్బులు, హై బీపీ, మధుమేహం లాంటివి త్వరగా అటాక్ చేసే ప్రమాదం ఉంది.
3. అందుకే వీలైనంత వరకు కొవ్వును అధికంగా తెచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోరాదు. ఒకవేళ తీసుకున్నా కొన్ని పద్ధతులు పాటిస్తే కొలెస్ట్రాల్ ను వెన్నలాగా కరిగించేయవచ్చు.
4. శరీరంలో కొలెస్ట్రాల్ వల్ల అన్ని రకాలుగా నష్టాలే. త్వరగా జబ్బుల బారిన పడతారు. తీసుకొనే ఆహారంతో పాటు సరైన వ్యాయామం లేకపోవడం, జీవన శైలిలో మార్పులు కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణమవుతాయి.
5. దీని వల్ల రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెకు చేరే రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీస్తుంది.
6. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల కేవలం గుండెకు మాత్రమే కాదు.. ఛాతిలో నొప్పి, త్వరగా అలసిపోవడం, మత్తు రావడం, రక్తపోటు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
7. రోజూ ఎక్సర్ సైజ్ చేస్తే ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ ను కరిగించవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా కొవ్వు శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
8. బీన్స్ ను తీసుకోవడం వల్ల విటమిన్లు, మినరల్స్ బాగా దొరుకుతాయి. చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది.
9. ఆకు కూరల్లో బచ్చలి కూర ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కొలెస్ట్రాల్ పెరగకకుండా అరికట్టడంలో కూడా బచ్చలి కూర ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇందులో విటమిన్ బి, ఇ, మెగ్నీషియం ఉంటాయి.
10. అలాగే బెండకాయలు కూడా బరువును తగ్గించడం, కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. టమోటా, బ్రోకలీ కూడా కొలెస్ట్రాల్ ను దరిచేరనీయవు. బ్రోకలీలో ఆరోగ్యకరమైన పోషకాలుంటాయి.
11. విటమిన్ సి తో పాటు ఫైబర్ కంటెంట్ అధికమొత్తంలో ఉంటుంది. ఇది రక్త ప్రసరణలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారిస్తుంది.
Read Also : Betel Leaves: భోజనం తిన్నాక తాంబూలం వేసుకోవచ్చా?