Pregnant Women Bath: సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజుకొకసారి స్నానం చేస్తారు. కొందరికి ఉదయం, సాయంత్రం రెండుపూట్ల స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ గర్భిణుల విషయానికి వస్తే స్నానానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (Pregnant Women Bath)
గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో మాత్రం.. చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఎక్కువసార్లు స్నానం చేస్తే… పదేపదే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే అబార్షన్ అవుతుందని కొందరు చెబుతుంటారు. ఇలాంటి విషయాలపై వైద్యులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.
మహిళలు గర్భం దాల్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అధిక బరువులు ఎత్తకపోవడం, సరైనా పౌష్టికాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తారు. అంతేకాకుండా స్నానం విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని చాలామందికి తెలియదు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…? ఇప్పుడు చూద్దాం.
గర్భిణులు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండకూడదని పెద్దలు చెబుతారు. అందువల్ల అబార్షన్ అవుతుందని హెచ్చరిస్తారు. అయితే వైద్య నిపుణులు ఏమంటున్నారంటే… మెట్లు ఎక్కడం దిగడం వల్ల అబార్షన్ కాదని… కాకపోతే జారి పడకుండా చూసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు. బరువులు పట్టుకుని మెట్లు ఎక్కకూడదు. గర్భిణులు మెట్లు ఎక్కేటప్పుడు పక్కన రెయిలింగ్ పట్టుకోవడం తప్పనిసరి.
ఒకే చేతితో మోయగలిగేంత బరువు ఉండి, మరో చేతితో రెయిలింగ్ పట్టుకునే అవకాశం ఉంటే మెట్లు ఎక్కడం ప్రమాదం కాదు. అలాగే మెట్లపై తడిలేకుండా చూసుకోవాలి. లేదంటే జారిపడే ప్రమాదం ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక్కో ఫ్లోర్ కు ఆగి… రిలాక్స్ అయితే మంచిది. కాకపోతే.. పొత్తికడుపులో నొప్పి, బ్లీడింగ్ సమస్యలు ఉన్నప్పుడు వీలైనంతవరకు మెట్లు ఎక్కడం, దిగడం అవాయిడ్ చేస్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గర్భిణులు ఎక్కువసార్లు స్నానం చేయకూడదని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది మూఢనమ్మకమని కొందరు కొట్టి పారేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళు అలా చెప్పడం వెనుక మంచి ఉద్దేశంతో కూడిన కారణాలే ఉన్నాయి. అవేంటంటే… మరీ వేడిగా, మరీ చల్లగా ఉన్న నీళ్లతో స్నానం చేయకూడదు. ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల ఒక్కోసారి జలుబు కూడా అవుతుంది. ఎక్కువసేపు తడిగా ఉన్న ప్రదేశాల్లో ఉండడంవల్ల జారిపడతారనే ఆందోళన కూడా ఉంటుంది.
అంతేకానీ గర్భిణులు ఎక్కువసార్లు స్నానం చేయకూడదని ఏమీ లేదు. కాకపోతే… నీళ్లు మరీ ఎక్కువ చల్లగా… మరీ ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోవాలి. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడంవల్ల గర్భిణీలకు మేలే జరుగుతుంది. శరీరంలో చిన్న చిన్న పెయిన్స్ ఉంటే గోరువెచ్చటి నీళ్లతో స్నానం వల్ల తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Vastu And Money: ఇంట్లో డబ్బును ఏ దిశలో దాచుకుంటే శుభప్రదం.. ఎక్కడ ఉంచితే ఇక్కట్లు?