Munaga Powder: మునగ కాయల్ని కూరలో వేసుకోవడమే కాకుండా పొడి రూపంలో తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం నుంచి చర్మ పరిరక్షణకు కూడా మునగ పొడి ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. మునగ చెట్టులో అనేకమైన పోషకాలు ఉంటాయి. చాలామంది మునగకాయలను ఆహారంలో తీసుకుంటారు. ఆకులను కూడా ఆయుర్వేదంలో వివిధ చికిత్సల్లో ఉపయోగిస్తారు. మునగ ముక్కలుగా కోసి కూరల్లో వేసుకుంటారు. వీటివల్ల రుచితో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. (Munaga Powder)
మునగపొడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపు నిండిన, ఆకలి తీరిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మునగపొడి రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శరీర సమగ్ర ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తి చాలా కీలకం. మునగ పొడి వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. ఏదైనా అనారోగ్యం కలిగినా త్వరగా కోలుకునేందుకు రోగ నిరోధక శక్తి ఉపయోగపడుతుంది.
మునగలోని పీచు పదార్థాల వల్ల ఆహారం జీర్ణం కావడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పేగుల్లో కదలికలు మెరుగుపడతాయి. మునగ పొడిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మునగ పొడిని ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం, కురులకు కూడా చాలా మేలు జరుగుతుంది. చర్మం గ్లో కోల్పోకుండా ఉంటుంది. వయసు మీద పడినట్టుగా కనిపించకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు తగ్గించడం వరకు మునగ పొడి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం జీర్ణం కావడానికి కూడా దోహదపడుతుందని సూచిస్తున్నారు. ఇలాంటి సహజసిద్ధమైన పద్ధతుల వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మునగపొడిలో యాంటీ ఆక్సిడెంట్లు
మునగ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని వాపుల్ని నివారిస్తుంది. కణాల డ్యామేజ్ ని కూడా అరికడుతుంది. ఫలితంగా తీవ్రమైన అనారోగ్యాల నుంచి కూడా కాపాడుతుంది. మునగ పొడిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. రోజంతా చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది.
Read Also : Jagananna arogya suraksha: నేటి నుంచి ఇంటింటికీ జగనన్న ఆరోగ్య రక్ష క్యాంపెయిన్