వాస్తు (Vastu for Positive Energy) శాస్త్రంలో అనేక విషయాలు మన నిత్య జీవితంలో పనికి వస్తాయని పండితులు చెబుతున్నారు. పాజిటివ్ ఎనర్జీని (Vastu for Positive Energy) పెంపొందించుకోవడానికి అనేక మార్గాలను వాస్తు పండితులు పేర్కొన్నారు. అలాగే నెగిటివ్ ఎనర్జీని పారదోలడానికి కూడా పలు పద్ధతులను వాస్తు శాస్త్రంలో వివరించారు. ఇంట్లో మనకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని, ఇలాంటి సమయంలో కొన్ని పద్ధతులను పాటించి నెగిటివ్ ఎనర్జీని (Vastu for Positive Energy) ఇంటి నుంచి పారదోలాలని చెబుతున్నారు.
నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండటం వల్ల ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురి కావడం, ఇబ్బందులు పడటం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ధన నష్టంతోపాటు అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయని హెచ్చరిస్తున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు పెరగడం, వైవాహిక బంధం బలహీనపడటం జరుగుతాయంటున్నారు. ఇలాంటి సమస్యలను నివారించుకోవడానికి వాస్తు శాస్త్రంలో అనేక సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.
పూజ గదిలో మనం వినియోగించే వస్తువు కర్పూరం. రోజూ ఉదయాన్నే ఒక చిన్న అగరబత్తీలో కర్నూరాన్ని ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుందని చెబుతున్నారు. అలాగే తులసి మొక్కను పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. సాధారణంగా తులసి మొక్కను హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీదేవిగా కొలుస్తారు. మరోవైపు తరచూ ఇంట్లో చప్పట్లు కొట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని చెబుతున్నారు.
మన వంటింట్లో దొరికే వాటిలో ఉప్పు ఒకటి. దీనికి అత్యంత శక్తిమంతమైన వస్తువుగా పేరుంది. ఆహారంలో రుచిని పెంచడంతోపాటు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి సాల్ట్‌కు ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోవాలంటే గురువారం రోజున కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ తుడుపుకర్ర నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తర్వాత ఇల్లంతా తుడుచుకోవాలట. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మాయమైపోతుందని చెబుతున్నారు. దాంతోపాటు టాయిలెట్‌లో ఓ గాజు గిన్నెలో కొద్దిగా ఉప్పు ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయట.
Vastu Tips: ఇంటి శుభ్రతలో ఇలాంటి టిప్స్ పాటిస్తే శుభప్రదం.. వాస్తులో ఏముదంటే..!
మన ఇంట్లో ప్రతి రోజూ శుభ్రంగా చెత్త ఊడ్చుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఇంకా అనేక పనులు చేసుకుంటూ ఉంటాం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రాకుండా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, సైన్స్ పరంగా శుభ్రతకు ఎంత ప్రాముఖ్యం ఉందో వాస్తు శాస్త్రంలోనూ అంతే ప్రాధాన్యం ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు.
హిందూ ధర్మం ప్రకారం పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని పెద్దలు చెబుతుంటారు. శుభ్రంగా ఉన్న ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహం నిలిచి ఉంటుందని చెబుతారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకోవడానికి కొన్ని ప్రత్యేక వాస్తు చిట్కాలు చెబుతున్నారు. ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వాస్తు నియమాల్లో చాలా చిట్కాలు సూచించారు పూర్వీకులు.
వాస్తు శాస్త్రంలో ప్రతి రోజూ క్లినింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇల్లు శుభ్రంగా లేకుంటే దరిద్ర దేవత తాండవిస్తుందని స్పష్టం చేస్తున్నారు పండితులు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, అలాగే వాస్తు శాస్త్రంలో సూచించిన అనేక అంశాలను అనుసరించడం ద్వారా జీవితంలో ఆనందమయ క్షణాలను గడపవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చీపురు పట్టుకొని చెత్త ఊడ్చరాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆర్థిక పరిస్థితి సైతం మెరుగుపడుతుంది. రాత్రి సమయాల్లో చీపురుతో ఊడ్చరాదని చెబుతున్నారు. ఇంట్లోని టాయిలెట్ లను కూడా ప్రత్యేకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంలను అశుభ్రంగా ఉంచడం వల్ల అనారోగ్యం కలుగుతుంది.
బూజు పట్టకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. బాత్రూమ్-టాయిలెట్ పరంగా వాస్తు దోషం ఉందని భావిస్తే.. ఉప్పు నింపిన గిన్నెను ఒక మూలలో ఉంచితే దోషాలు పోతాయని సూచిస్తున్నారు. ఇంటికి నాలుగు మూలల్లో ఎప్పుడూ శుభ్రత పాటించాలి.
Read Also : Wife and Husband: భర్త మీ మాట వినేలా చేయాలంటే ఏం చేయాలి?