క్రమం తప్పకుండా కొంత మంది వ్యాయామం చేస్తుంటారు. దీని వల్ల మనిషి ఫిట్‌నెస్‌గా ఉంటాడు. అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది. శరీరం మొత్తం వ్యాయామం వల్ల కదలాడుతుంది. ప్రత్యేకించి ఫుట్ మసాజ్ (Foot Massage) చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి. పాదాల మసాజ్‌తో (Foot Massage) బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఆయుర్వేద వైద్యంలో పాదాల మసాజ్ కు (Foot Massage) ప్రత్యేకత ఉంది.
1. ఫుట్ మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరంలోని నరాలు ఉత్తేజితమవుతాయి. బాడీ మొత్తం రిలాక్స్ ఫీల్ వచ్చేస్తుంది.
2. దీని ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరగడం, కండరాలు నిస్తేజంగా ఉండిపోకుండా చేయడం, ఒత్తిడిని జయించడం, కాళ్ల నొప్పి తగ్గిపోవడం లాంటి బెనిఫిట్స్ కలుగుతాయి.
3. ప్రతి రోజూ ఓ పది నిమిషాల పాటు పాదాల మసాజ్ చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
4. ఫుట్ మసాజ్ ఫుట్ రోలర్లతో చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఇలాచేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
5. శరీర భాగాలపైన, సరైన రీతిలో ఒత్తిడి కలిగేలా పాదాలను మసాజ్ చేసుకోవాలి. ఒక పద్ధతి ప్రకారం పాదాలను మసాజ్ చేసుకోవడం వల్ల శరీరానికి అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు.
6. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఫుట్ మసాజ్ ప్రత్యేక మెడిసిన్ గా చెప్పుకోవచ్చు.
7. రోజూ పాదాల మసాజ్ చేసుకోవడం వల్ల రోజంతా కష్టపడి పని చేసినా, కార్యాలయాల్లో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నా.. ఈ సమస్యల నుంచి త్వరగా బయట పడొచ్చు.
8. ముఖ్యంగా మహిళలు ప్రసవానంతరం డిప్రెషన్ కు వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రిఫ్లెక్సాలజీ ఆధారంగా ఫుట్ మసాజ్ చేస్తే మహిళలు త్వరగా రికవరీ అవుతారు.
ఒబెసిటీ నుంచి డయాబెటిస్ దాకా.. సర్వం మటుమాయం.. ఇది ప్రయత్నించండి..
ప్రతి రోజూ ఉదయం పాలు లేదా టీ, కాఫీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలలో బెల్లం, లేదా చక్కెర కలుపుకొని తాగడం కొందరికి అలవాటుగా ఉంటుంది. మరికొందరికి పాలలో పసుపు, మిరియాలు, ఖర్జూరాలు లాంటివి కలుపుకొని తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
1. పాలలో ఈసబ్ గోల్ కలుపుకొని తాగితే ఊబకాయం సమస్య నుంచి బయట పడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
2. ఈసబ్ గోల్ అనేది గోధుమలా కనిపిస్తుంది. ఇది చిన్నపాటి ఆకులు, పువ్వులతో ఉంటుంది. ఈ రకమైన మొక్క కంకులపై ఉండే విత్తనాలను ఓ తెల్లటి పదార్థం అంటుకొని ఉంటుంది.
3. దాని పేరే ఈసబ్ గోల్. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
4. ఈసబ్ గోల్ లో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. దీన్ని పాలతో కలిపి తీసుకోవచ్చు.
5. ఇలా చేయడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, మూత సంబంధిత సమస్యలు, మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి.
6. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఉపాయంగా పని చేస్తుందనడంలో సందేహం లేదు.
7. పాలలో కలుపుకొని ఈసబ్ గోల్ ను క్రమం తప్పకుండా వాడితే శరీరంలోని కొవ్వు ఇట్టే కరిగిపోవాల్సిందే. సన్నగా, నాజూగ్గా తయారవుతారు.
8. అంతేకాకుండా కడుపునొప్పి, విరేచనాల సమస్య కూడా తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
9. ఇటీవలి కాలంలో డయాబెటిస్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో విరుగుడుగా పాలు, ఈసబ్ గోల్ కాంబో తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.
Read Also : White Sugar: వైట్ షుగర్‌తో ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..