Fat reduction: ప్రస్తుత జీవన శైలి, ఆహారం కారణంగా చాలా మందికి పొట్ట పెరిగిపోతుంటుంది. ఆడవారు, మగవారు కూడా చెడు కొలెస్ట్రాల్‌తో పొట్ట ముందుకు కనిపించే పరిస్థితి. సేద్యం చేసే రైతన్నలు, కూలినాలి చేసుకొనే శ్రమైక జీవులకు పొట్ట, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు దరిచేరవు. అయితే, ఏసీ గదుల్లో కూర్చొని పని చేసేవారు, ఇళ్లలో పని చేసుకొనే గృహిణులకు పొట్ట పెరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పాత కాలం పద్ధతిలో పొట్ట తగ్గించుకొనే విధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం. (Fat reduction)
చాలా మంది సన్నగా ఉన్నప్పటికీ పొట్ట మాత్రం ముందుకు వస్తుంటుంది. శరీరం మొత్తం కొవ్వు లేకుండా కేవలం పొట్ట వద్ద మాత్రమే కొవ్వు పెరుగుతూ ఉంటుంది. పొట్ట తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈనో పౌడర్ తాగడం, జీలకర్ర పొడి తినడం, నిమ్మకాయ నీళ్లు తాగడం లాంటివి నిత్యం పాటించే పద్ధతులు. అయితే, చాలా సింపుల్ టెక్నిక్‌తో నెల రోజుల్లోనే పొట్ట తగ్గించుకోవచ్చు.
ఓ రెండు వెల్లుల్లిపాయ ముక్కలు తీసుకోండి. పాన్ పొయ్యి మీద పెట్టి వాటిని కాస్త దోరగా వచ్చేలా సన్నటి సెగపై వేయించండి. తర్వాత ఓ గిన్నె తీసుకొని రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. వాటిని కాస్త మరిగించాలి. తర్వాత పొయ్యి కట్టేసి ఓ గ్లాసులో వేడి నీళ్లు పోసుకోండి. రెండో గ్లాసులోనూ అవే నీరు పోయండి. తర్వాత ఓ నిమ్మ కాయ కోసి సగం ఒప్పును ఓ గ్లాసులో పిండాలి. ఆ తర్వాత ఓ స్పూను తేనెను వేయండి. స్పూన్‌తో కలపండి. అనంతరం పచ్చి జీలకర్రను పొడి చేసుకొని ఓ స్పూనును ఇంకో గ్లాసు వేడి నీటిలో కలపాలి.
దోరగా వేయించిన వెల్లుల్లి ముక్కను పంటి కింద వేసి కరకరా నమిలేయండి. తర్వాత జీలకర్ర పొడిని కలిపిన వేడి నీటిని తాగేయండి. తర్వాత ఓ రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మరో వేయించిన వెల్లుల్లి ముక్కనూ కసకసా నమిలేయండి. అనంతరం ఇంకో గ్లాసు నీళ్లు కూడా గుటగుటా తాగేయండి. నీరు గోరువెచ్చగా ఉండాలని గుర్తు పెట్టుకోండి. ఇలా కొన్నాళ్లు చేస్తే నెల తిరక్కుండానే మీ పొట్ట అమాంతం తగ్గిపోవడం గమనించవచ్చు.
ఈ పద్ధతులు పాటిస్తే పొట్ట దరిచేరదు..
* తీపి తినడం తగ్గించేయాలి. పంచదార, బెల్లం, స్వీట్లు, జిలేబీ.. లాంటివేవీ తినకండి.
* అన్నం తక్కువ తినండి. కూర ఎక్కువ వేసుకోండి.
* మంచి నీళ్లు ఎక్కువగా తాగండి. రోజుకు 3-5 లీటర్లు తాగితే బెటర్.
* మార్నింగ్ వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వేగంగా వస్తాయి.
Read Also: Belly Fat: బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని విసిగిస్తోందా? ఇలా చేస్తే వెంటనే మటుమాయం ఖాయం..