HomeAndhra PradeshBalakrishna in Assembly: విజిలేసిన బాలయ్య.. సభలో టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన

Balakrishna in Assembly: విజిలేసిన బాలయ్య.. సభలో టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన

Balakrishna in Assembly: ఏపీ అసెంబ్లీలో నిన్నటి నుంచి హైడ్రామా కొనసాగింది. నిన్న వచ్చీ రాగానే స్పీకర్‌పైకి దూసుకెళ్లి పేపర్లు చించేసిన టీడీపీ సభ్యులు.. ఇవాళ కూడా అదే తీరు అవలంబించారు. నిన్న చేతి సంజ్ఞలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇవాళ విజిలేసి రచ్చ చేశారు. సభా మర్యాదలు పాటించకుండా ఎలా పడితే అలా బిహేవ్‌ చేశారు. స్పీకర్‌ సర్ది చెప్పాలని ప్రయత్నించారు. (Balakrishna in Assembly)

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనతో స్పీకర్‌ విసిగిపోయారు. విజిల్స్‌తో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులను శాంతిపజేయాలని ప్రయత్నించారు. విజిల్స్‌ ఆపాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. అయినా పట్టించుకోని టీడీపీ సభ్యులు.. తమ గోల కంటిన్యూ చేశారు. అసెంబ్లీ నుంచి నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఒకరోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ విధిస్తూ నిర్ణయం వెలువరించారు.

టీడీపీ సభ్యులను మానసిక ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చురకలంటించారు. అసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తన సరికాద బియ్యపు మధుసూదన్‌ పేర్కొన్నారు. మరోవైపు మండలిలోనూ టీడీపీ సభ్యులు ప్రకార్డులతో నిరసన తెలిపారు. అరుపులు కేకలతో సభ గందరగోళంగా మారింది. గలాటా మధ్యనే క్వశ్చన్ అవర్ కొనసాగింది. మార్షల్స్‌ను నెట్టి వేస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యులు గోలచేశారు. మండలిలో టీడీపీ సభ్యుల కేకలతో మార్షల్స్ ను మోహరించారు. టీడీపీ సభ్యులు చైర్మన్ వద్దకు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకుండా నినాదాలు చేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇలా రెండు రోజులుగా టీడీపీ సభ్యులు అటు శాసనసభలో, ఇటు మండలిలో ఒకటే అజెండాతో పని చేసినట్లు స్పష్టమవుతోంది.

కేవలం సభను అడ్డుకోవాలి, అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతోనే వీరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని క్లియర్‌ కట్‌గా తెలిసిపోతోంది. చంద్రబాబు అరెస్టుపై చర్చిద్దామని, ఎంత సమయం కావాలన్నా ఇస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన చెప్పినా కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు. కేవలం రచ్చ మాత్రమే చేశారు.

https://x.com/SajjalaBhargava/status/1704772082406682720?s=20

అసెంబ్లీలో ఇక తమ పప్పులుడకవని భావించిన టీడీపీ సభ్యులు.. సెషన్‌ మొత్తం బాయ్‌ కాట్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.

https://x.com/RGVzooi/status/1705089451519787488?s=20

Read Also : CBN remand: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు : చంద్రబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు